By: RAMA | Updated at : 20 Oct 2022 05:59 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 20th October 2022
Horoscope Today 20th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. తెలియని వ్యక్తితో భాగస్వామ్య వ్యాపారం చేయడం హానికరం అని తెలుసుకుంటారు. చట్టపరమైన విషయాల్లో మీరు గుడ్ న్యూస్ వింటారు
వృషభ రాశి
ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజాసంబంధాలు, సేవా కార్యక్రమాలతో సంబంధం ఉన్న వర్గాలకు ఈరోజు చాలా మంచిరోజు. పాత స్నేహితులను కలుస్తారు..పాత విషయాలు మరిచిపోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
మిథున రాశి
మనశ్శాంతి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. స్నేహితులను కలుస్తారు. ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులోకి రాకుండా ఉండాలి..అప్పుడే సంతోషంగా ఉంటారు.
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, క్షీరాబ్ది ద్వాదశి - పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
కర్కాటకరాశి
తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మరింత శ్రద్ధ పెట్టాలి. మానసిక స్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త ప్రణాళికలు అమలుచేస్తారు.
సింహ రాశి
క్రమశిక్షణ నియమాలను అనుసరిస్తారు. పని పెరుగుతుంది. తెలివిగా వ్యవహరిస్తారు. మేనేజ్ మెంట్ పై శ్రద్ధ వహిస్తారు. మీరు వ్యాపార సంబంధాలకు ప్రాముఖ్యత ఇస్తారు. మీ పనులు పూర్తిబాధ్యతతో ఉండేందుకు ప్రయత్నించండి. ప్రలోభాలకు దూరంగా ఉండండి.
కన్యా రాశి
వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగస్తులు, విద్యార్థులకు ఈ రోజు మంచిది. మనస్సు చంచలంగా ఉంటుంది. ఓపికగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం జాగ్రత్త. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
తులా రాశి
మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ మీ భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఈ రోజు మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. అనుభవజ్ఞుడైన వ్యక్తి నుంచి సలహా తీసుకుని పనిలో ముందుకు సాగండి.
వృశ్చిక రాశి
నిన్నటి కన్నా ఈరోజు మెరుగ్గా ఉంటుంది కానీ దీనిని ఒక ముఖ్యమైన రోజు అని పిలవలేము. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగులు తమ పనులు పూర్తిస్థాయిలో చేయగలుగుతారు. నిరుద్యోగులు త్వరలో శుభవార్త వినే అవకాశం ఉంది.
Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!
ధనుస్సు రాశి
ఉద్యోగంలో పురోభివృద్ధికి అవకాశాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. మాటల్లో మృదుత్వం ఉంటుంది. ఈ రోజు మీకు శుభదినం. ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి.
మకర రాశి
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. మనస్సులో సానుకూల ఆలోచనల ప్రభావం ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ రోజు నుంచి మీ జీవితం కొత్తగా ప్రారంభమవుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.
కుంభ రాశి
ఈ రోజు ఓపికగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. వైద్య ఖర్చులు పెరుగుతాయి. మనస్సులో నిరాశ లేదా అసంతృప్తి ఉంటాయి. కుటుంబ సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. ఆదాయంలో తగ్గుదల, ప్రణాళిక లేని ఖర్చులు ఉంటాయి.
మీన రాశి
మీ మనస్సు చెప్పింది వినండి. స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ప్రత్యర్థులు విజయం సాధిస్తారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది
Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు
మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది
మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!