అన్వేషించండి

Karthika Masam 2022: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, క్షీరాబ్ది ద్వాదశి - పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

Karthika Masam 2022: శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది...కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులేంటో చూద్దాం..

Karthika Masam 2022: ఏటా దీపావళి మర్నాడే కార్తీకమాసం ప్రారంభమవుతుంది..ఈ ఏడాది అమావాస్య తగులు మిగులు రావడంతో అక్టోబరు 24 సోమవారం రోజే నరకచతుర్ధశి, దీపావళి జరుపుకుంటున్నారు. అక్టోబరు 25 మంగళవారం సూర్య గ్రహణం రావడంతో పాటూ అమావాస్య ఘడియలు సూర్యాస్తమయ సమయానికి లేవు. అయితే సాధారణంగా దీపావళి పండుగ చేసుకున్న రాత్రి తెల్లవారినప్పటి నుంచీ కార్తీకమాసం ప్రారంభం అవుతుంటుంది. కానీ ఈ ఏడాది దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజు నుంచి కార్తీకమాసం మొదలవుతోంది. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న తిథే నెల ప్రారంభానికి సూచన. ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మమూహూర్తంలోనే కదా..అందుకే దీపావళి మర్నాడు అంటే మంగళవారం సూర్యోదయానికి అమావాస్య  ఉంది...మంగళవారం సాయంత్రం సూర్యస్తమయ సమయంలో మొదలైంది పాడ్యమి తిథి. అందుకే అక్టోబరు 26 బుధవారం నుంచి కార్తీకమాసం మొదలవుతుంది...

“న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్” అని స్కంద పురాణంలో చెప్పారు. అంటే.. “కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం. కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ఏడాది అక్టోబరు 26 నుంచి నవంబరు 23 వరకూ

Also Read: దీపావళికి లక్ష్మీ పూజలో ఫాలో అవ్వాల్సిన 10 ప్రత్యేక విషయాలు
 
అక్టోబరు 26 బుధవారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి
అక్టోబరు 27 గురువారం  యమవిదియ - భగినీహస్త భోజనం
అక్టోబరు 29 శనివారం   నాగుల చవితి
అక్టోబరు 31  కార్తీకమాసం మొదటి సోమవారం
నవంబరు 1 మంగళవారం కార్తావీర్యజయంతి
నవంబరు 3 గురువారం  యాజ్ఞవల్క జయంతి
నవంబరు 4 శుక్రవారం మతత్రయ ఏకాదశి
నవంబరు 5 శనివారం క్షీరాబ్ది ద్వాదశి
నవంబరు 6 ఆదివారం వైకుంఠ చతుర్థశి
నవంబరు 7 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, జ్వాలా తోరణం
నవంబరు 8 మంగళవారం - కార్తీకపూర్ణిమ ( చంద్రగ్రహణం)
నవంబరు 11 శుక్రవారం - సంకటహర చతుర్థి
నవంబరు 14 కార్తీకమాసం మూడో సోమవారం
నవంబరు 20 ఆదివారం  మతత్రయ ఏకాదశి
నవంబరు 22 మంగళవారం  మాస శివరాత్రి ( కార్తీకమాసం ఆఖరి రోజు)
నవంబరు 24 గురువారం  పోలిస్వర్గం 

Also Read: దీపావళికి ఈ చీపురు కొంటే సిరిసంపదలని ఎందుకు చెబుతారంటే!

కార్తీకమాసం నెలరోజులూ అత్యంత నియమనిష్టలతో ఉంటారు. కార్తీమాసం నియమాలు పాటించేవారు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. చలిగాలులు పెరుగుతాయి కాబట్టి ఈ నెలలో పేదలకు, అనాధలకు స్వెటర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివ కేశవవుల  అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. దానధర్మాలు గోప్యంగా చేసినవాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నది గుర్తుంచుకోవాలంటారు పండితులు.

కార్తీకమాసంలో చేయకూడనివి

  • లైంగిక వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం ముట్టుకోరాదు
  • ఎప్పుడూ ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు..కనీసం ఓ నియమంలా పాటిస్తూ ఈ నెలరోజులైనా పాపపు ఆలోచనలు మానేయాలి
  • విశ్వాసం ఉంటే దేవుడిని పూజించండి లేదంటే మానేయండి... దైవదూషణ మాత్రం చేయకండి
  • దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు ఉపయోగించకండి
  • మినుములు తినకూడదు, నలుగుపెట్టుకుని స్నానం చేయకూడదు
  • కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినకూడదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Tata Advanced Systems Limited:  టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ …  ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ … ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Embed widget