News
News
X

Diwali 2022: దీపావళికి లక్ష్మీ పూజలో ఫాలో అవ్వాల్సిన 10 ప్రత్యేక విషయాలు

దీపావళి, నరకచతుర్థశి ఈ ఏడాది ఒకేరోజు వచ్చాయి..అందుకే ఉదయం నరకచతుర్థశి జరుపుకుని సాయంత్రం చీకటి పడగానే లక్ష్మీపూజ చేసుకుని దివాలీ వేడుకలు నిర్వహిస్తారు. లక్ష్మీపూజ చేసేవారు పాటించే నియమాలేంటంటే..

FOLLOW US: 

ధన త్రయోదశి అయిన మర్నాడు నరకచతుర్థశి ఆ తర్వాత రోజు దీపావళి జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది చతుర్థశి, అమావాస్య తిథులు తగులు మిగులు కారణంగా రెండూ ఒకేరోజు వచ్చాయి. అక్టోబరు 24 సోమవారం సూర్యోదయానికి చతుర్థశి ఉండడంతో నరకచతుర్థశి...ఆ రోజు సూర్యాస్తమయం సమయానికి అమావాస్య రావడంతో అదే రోజు దీపావళి జరుపుకుంటారు.  
మరీ ముఖ్యంగా అక్టోబరు 25 మంగళవారం సూర్యగ్రహణం ఉంది..అమావాస్య తిథి కూడా సూర్యస్తమయం వరకూ లేదు.. అందుకే దీపావళి ఏ రోజు జరుపుకోవాలనే ఆలోచనే అవసరం లేదు..అక్టోబరు 24 సోమవారమే దీపావళి. ఇక పూజ చేసుకునే ముహూర్తం అంటూ రకరకాల టైమ్ లు చెబుతున్నారు కానీ..దీపావళికి లక్ష్మీ పూజ అంటే సూర్యస్తమయం అయి దీపాలు పెట్టే సమయమే సరైన సమయం. అంతకుమించి మంచి ఘడియలు చూసుకోవాల్సిన అవసరం లేదు. 

Also Read: దీపావళికి ఈ చీపురు కొంటే సిరిసంపదలని ఎందుకు చెబుతారంటే!

దీపావళి రోజున లక్ష్మీ పూజలో ఫాలో అవ్వాల్సిన 10 ప్రత్యేక విషయాలు

 • బంగారం లేదా వెండి లేదా లోహంతో చేసిన పాదముద్రలను దీపావళి రోజున లక్ష్మీదేవి ఆరాధనలో ఉంచాలి. బంగారం, వెండితో చేసిన పాదముద్రలను ఉంచలేనివారు కాగితంపై చేసిన మెట్ల గుర్తును  పూజించాలి.
 • శంఖం లేకుండా లక్ష్మీదేవి ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటూ దక్షిణాభిముఖ శంఖాన్ని పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
 • శ్రీ యంత్రాన్ని పూజిస్తే అప్పుల బాధలు తీరి సిరిసింపదలకు లోటుండదని చెబుతారు
 • దీపావళి రోజు లక్ష్మీదేవివి ప్రత్యేకంగా స్వీట్ నైవేద్యంగా సమర్పించి సకల శుభాలు ప్రసాదించమని వేడుకుంటారు
 • పరిశుభ్రత ఎక్కువగా ఉండే ఇళ్ళలో లక్ష్మీదేవి ఉంటుంది..అందుకే అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్దం మామిడి తోరణాలు, పూలదండలు కట్టి ఉంచాలి
 • పసుపు శుభానికి, కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం..అమ్మవారిని పసుపు కుంకుమతో అర్చించాలి
 • హిందూమతంలో తమలపాకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవి, గణేషుడి ఆరాధనలో భాగంగా తమలపాకుపై స్వస్తిక్ గుర్తు వేస్తారు
 • లక్ష్మీదేవి సేవలో ఉంటుంది ఏనుగు. అందుకే లక్ష్మీదేవిని గజలక్ష్మి అని కూడా అంటారు. ఏనుగుకు చెరకుగడలు ఇష్టం కాబట్టి లక్ష్మీపూజలో ఇవి కూడా చేరుస్తారు. మన్మధుడి నుంచి అమ్మవారు తీసుకున్న విల్లుతో సమానంగా చెరుకుగడను భావిస్తారు..అంటే అది ఆయుధం అన్నమాట.
 • చాలా మంది కొత్తిమీర గింజలను కొని వాటిని ఇంట్లోనే ఉంచుకుంటారు. ముఖ్యంగా దీపావళి రోజు పూజలో ఉంచి ఆ తర్వాత బీరువాలో భద్రపరుస్తారు..ఇది అదృష్, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు.
 • లక్ష్మీదేవి ఎప్పుడూ తామరపువ్వుపై కూర్చుని ఉంటుంది. ఆమె ఆసనం అయిన తామరపూలతో లక్ష్మీఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. 

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' ఏ సమయంలో పెట్టాలి!

News Reels

దీపావళి లక్ష్మి-కుబేర పూజ మంత్రం
1. ఓం శ్రీం శ్రియై నమః
2. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః
3. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలయే ప్రసిద్ ప్రసిద్ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీయై నమః
4. కుబేరు ప్రార్థన మంత్రము - దండాయ నమస్తుభ్యము నిధిపద్మధిపాయ చ. త్వత్ప్రసాసేన్ ధంధన్యాదిసంపదః..

మహాలక్ష్మి మంత్రం
ఓం శ్రీ హ్రీం శ్రీం కమలే కమలయే ప్రసిద్ ప్రసిద్ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయై నమః.

శ్రీ లక్ష్మీ బీజ మంత్ర ఓం
హ్రీం శ్రీం లక్ష్మీభయో నమః

అర్ఘ్య మంత్రం
క్షీరోదరనవసంభూతే సురసురనామస్క్రిత్.
సర్వదేవమయే మాతర్ గృహానాగగరఘ్య నమో నమః.

అభ్యర్థన మంత్రం
సురభి త్వం జగన్మత్తర్దేవీ విష్ణుపాదే స్తి.
సర్వదేవమయే గ్రాసమ్ మాయా దత్తమిం గ్రాస్..

ప్రార్థన మంత్రం
సర్వమయే దేవి సర్వదేవైర్లద్కృతి.
మరమ్మభిలాషితం సఫలం కురు నందిని.

Published at : 18 Oct 2022 05:20 PM (IST) Tags: Dhanteras goddess lakshmi Diwali 2022 Date Shubh Muhurat diwali Puja and Significance of Diwali Naraka Chathurdasi Balipratipada Yama Dwitiya Diwali-2022 Date Shubh Muhurat Diwali 2022

సంబంధిత కథనాలు

Astro Tips: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

Astro Tips: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

Chanakya Neeti Telugu: ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది

Chanakya Neeti Telugu: ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది

Facts About People Born in December: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

Facts About People Born in December: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

Daily Horoscope Today 30th November 2022: ఈ రాశివారు గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు, నవంబరు 30 రాశిఫలాలు

Daily Horoscope Today 30th November 2022: ఈ రాశివారు గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు, నవంబరు 30 రాశిఫలాలు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?