అన్వేషించండి

Weekly Horoscope in Telugu: వార ఫలం - మే 12 నుంచి మే 18 వరకు!

Weekly Horoscope: మే 12 ఆదివారం నుంచి మే 18 శనివారం వరకూ ఈ వారం చిన్న చిన్న సమస్యలు మినహా దాదాపు 12 రాశులవారికీ అనుకూల ఫలితాలే ఉన్నాయి...మీ రాశి వారఫలితం ఇక్కడ తెలుసుకోండి....

Weekly Horoscope May 12 to 18th 

మేష రాశి 

ఈ వారం మీరు మీ జీవనశైలిలో చాలా మార్పులొస్తాయి. ఉద్యోగులకు శుభసమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక వృద్ధి ఉంటుంది. భవిష్యత్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయాల్లో ఉండేవ్యక్తులు తమ తెలివితేటలతో విజయం సాధిస్తారు. సినిమా రంగంలో పనిచేసే వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. అయితే తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులు, సన్నిహితులతో అపార్థాలకు అవకాశం ఇవ్వకండి..

వృషభ రాశి 

ఈ వారం ఈ రాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు..అయితే గ్రహాల అనుగ్రహం అంత అనకూలంగా లేదు ఆలోచించి అడుగేయండి. మీ రాశిలోకి సూర్యుడి ప్రవేశం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆస్తి వివాదాలను పరిష్కరించుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ , గౌరవం పెరుగుతుంది. పాత వ్యాధి నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశాలలో ఉద్యోగం పొందాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రయత్నం తర్వాత పరిష్కారమవుతాయి. మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉన్నారు మీరు అప్రమత్తంగా వ్యవహరించంజడి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.  డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  

Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!

మిథున రాశి

ఈ వారం మొత్తం మీకు శుభప్రదంగా ఉంది. అదృష్టం కలిసొస్తుంది.  పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. డబ్బు ఆదా చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు శ్రమ అధికమైనా తగిన ఫలితాన్ని పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోపం తగ్గించుకోవాలి. మీరు మీ పనికి బదులు ఇతరుల కార్యకలాపాల పట్ల ఆకర్షితులవుతారు. మోసపూరిత వ్యక్తులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.  గ్రహబలం అనుకూల ఫలితాలనిస్తుంది..మీ కీర్తి పెరుగుతుంది. భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటక రాశి

ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు తమ పనితో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో భాగస్వామ్యం కోసం ప్లాన్ చేసుకోవచ్చు.  కొద్దిపాటి శ్రమతో మీ పని పూర్తి అవుతుంది. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆదాయం పెరుగుతుంది.  వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారవచ్చు.  ఎవరి మాటలను వెంటనే నమ్మవద్దు. మీ శత్రువుల ప్రవర్తనను గమనించండి. మొదలుపెట్టిన పనిని అసంపూర్తిగా ఉంచేయకుండా పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. అపరిచిత వ్యక్తులతో అనవసర చర్చలు మంచివి కావు. గురుగ్రహం ప్రభావంతో పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని ఖర్చులున్నాయి.

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!

సింహ రాశి

సింహ రాశివారు వారం మొత్తం ఉత్సాహంగా ఉంటారు. ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించడం మీకు కలిసొస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. గతంలో చేసిన తప్పులపట్ల మనసులో పశ్చాత్తాపం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  మీ అభిప్రాయాల పట్ల మొండిగా ఉండటం మానుకోండి. ఇతరుల అభిప్రాయాలను  గౌరవించండి. ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి.  స్నేహితుల సూచనలు మీకు మంచి ఫలితాలనిస్తాయి

కన్యా రాశి

ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి..వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. నూతన పెట్టుబడులు లాభాలనిస్తాయి. మనోబలం పెరుగుతుంది.  నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది.  ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.  పరిశోధన పని పట్ల చాలా ఆకర్షితులవుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.  మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటారు. అనవసర ఆలోచనతో సమయాన్ని వృథా చేసుకోవద్దు

Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!

తులా రాశి

ఈ వారం మీరు మంచి ఆర్థిక ఫలితాలు పొందుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ లక్ష్యాలపై దృష్టి సారిస్తే ఆశించిన ఫలితాలు పొందుతారు. మీ గౌరవం పెరుగుతుంది..శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆధ్యాత్మిక గ్రంధాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. చాలారోజులుగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి.  ఉద్యోగంలో మార్పు విషయంలో మీ మనసులో ఉన్న సందిగ్ధత పరిష్కారం అవుతుంది.  ఎవరి ఒత్తిడి, ప్రభావంతో పని చేయవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చుల విషయంలో కొంత కంట్రోల్ అవసరం.  

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో   మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు.  దైవబలం మీకు రక్షణగా నిలుస్తుంది. మీవల్ల మీ చుట్టూ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కమీషన్ సంబంధిత పనిలో మంచి డబ్బు సంపాదిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.  విద్యార్థులు తమ కెరీర్‌కు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత గందరగోళాన్ని ఎదుర్కొంటారు.ఉద్యోగం, వ్యాపారంలో గందరగోళానికి దూరంగా ఉండాలి.

ధనస్సు రాశి

ఈ వారం మీకు చాలా అనుకూల ఫలితాలున్నాయి. మీరు మతపరమైన కార్యక్రమాలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు.  ప్రముఖులతో మీ సంబంధాలు బలపడతాయి. నిలిచిపోయిన ప్రభుత్వ పనులు ఈ వారంలో పూర్తి కాగలవు. ఐటీ ,మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వాహనాలు నడపేటప్పుడు జాగ్రత్త. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. పని ఒత్తిడి పెరుగుతుంది. జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించండి. 

Alos Read: పురాణాల్లో సింగిల్ మదర్స్ వీళ్లే - ఎన్నో కష్టాలు పడ్డారు కానీ తనయుల్ని వీరులుగా తీర్చిదిద్దారు!

మకర రాశి

ఈ వారం ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. యువత తమ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తుల సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.  చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం మానుకోవాలి.  మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం , వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  తెలియని ఆందోళన, భయం మనసులో మెదులుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి.  

కుంభ రాశి

ఈ వారం మీకు పని ఒత్తిడి తగ్గుతుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. చట్టపరమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉండొద్దు. వైవాహిక జీవితం బావుంటుంది. స్త్రీలు రతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడతారు. 

Also Read: దేవుడు అమ్మను సృష్టించడం కాదు - అమ్మే దేవుడికి జన్మనిచ్చింది!

మీన రాశి 

ఈ వారం మొత్తం మీకు శుభప్రదంగా ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల అంచనాలను అందుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి.  మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. విద్యార్థులు భవిష్యత్ ప్రణాళికల విషయంలో గందరగోళానికి గురవుతారు. 

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
BJP Leader Annamalai : డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
Embed widget