అన్వేషించండి

Zodiac Signs : ఈ 4 రాశులవారు జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు - మీరున్నారా ఇందులో!

Astrology: కొందరు చిన్న చిన్న విషయాలకు బాధపడిపోతుంటారు..మరికొందరు ప్రతిక్షణాన్ని ఆనందిస్తారు. ఈ స్వభావం మీ జన్మరాశిపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..

Zodiac Signs : సంతోషంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి..కానీ చుట్టూ ఉండే పరిస్థితులు, వ్యక్తిత్వం, ఆలోచనా విధానం.. వీటన్నింటి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది.

ఎన్ని సమస్యలు ఎదురైనా చిరునవ్వుతో వాటిని అధిగమించి ప్రతిక్షణాన్ని ఆస్వాదించేవారు కొందరు..

చిన్న చిన్న సమస్యలకు కూడా కుంగిపోయి మరింత బాధలోకి కూరుకుపోయేవారు ఇంకొందరు...

ప్రస్తుతం ఉన్న సంతోష క్షణాలను ఆస్వాదించకుండా భవిష్యత్ లో ఏమైనా ఇబ్బందులు వస్తాయనే భావనలో మరికొందరు..

ఈ ఆలోచన  మీ జన్మరాశిపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే వచ్చే ఇబ్బందులు ఎలాగూ రాకమానవు.. ఏం జరుగుతుందో అని ప్రతిక్షణం ఆలోచిస్తూ బాధపడుతూ జీవించేకన్నా ఈ క్షణం సంతోషంగా ఉన్నామా లేదా అని ఆలోచించేవారిలో ఈ రాశులవారున్నారు...

మేష రాశి

అగ్నికి సంకేతం అయిన మేషరాశివారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.  సాహోసపేతంగా వ్యవహరిస్తారు. వీరికి జీవతం అంటే ఓ అన్వేషణ. ఎదురైన ప్రతిక్షణం ఓ పాఠంగానే భావిస్తారు. పాతవస్తువులు అగ్నికి ఆహుతైనట్టే..పాత విషయాలను ఎక్కడికక్కడ వదిలేసి ముందుకుసాగిపోతారు. కొత్త విషయాలు తెలుసుకోవడం థ్రిల్లింగ్ గా భావిస్తారు. హడావుడిగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ జీవితంలో ప్రతిక్షణం ఆస్వాదిస్తారు. వీళ్లకు బాధలు ఉండవా అంటే ఉంటాయ్..కానీ దేన్నీ మనసుకి తీసుకోరు. బాధపడినా కొద్దిసేపే. 

Also Read: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం 

సింహ రాశి

సింహరాశి వారికి జీవితం పట్ల అసమానమైన అభిరుచి ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు..అందుకు తగ్గట్టే వీరిలో సహజమైన తేజస్సు ఉంటుంది. తమ జీవితం ఎప్పుడూ వెలుగులో ఉన్నట్టే భావిస్తారు. అదే పాజిటివ్ ఎనర్జీతో ముందుకుసాగిపోతారు. విలాసవంతంగా ఉన్నా, చిన్న చిన్న విషయాలను అయినా ఒకేలా ఆనందిస్తారు. ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు...ప్రతి సంఘటనను మరపురాని అనుభూతిగా భావిస్తారు. వీరిలో ఉండే నాయకత్వ లక్షణాలు..రాజు ఎక్కడున్నా రాజే అనేలా ఉంటారు. గడిచిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేం..అందుకే ప్రతిక్షణం సంతోషంగా ఉండాలన్నదే వీరి భావన

ధనుస్సు రాశి

అగ్నికి సంకేతం అయిన ధనస్సు రాశివారు జీవితంలో స్వేచ్ఛను కోరుకుంటారు..పక్షిలా విహరించాలి అనుకుంటారు. అందేకే ప్రయాణాలను ఆస్వాదిస్తారు. సాహసాలు చేయడం అంటే మహాసరదా. జీవితంపై ఎప్పుడూ ఆశావద ధృక్పథాన్ని కలిగిఉంటారు..అందుకే ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి..అందుకే వీరికి సహజంగా తెలివితేటలు ఎక్కువ. రేపు ఏం జరుగుతుందో అనే భావన కాకుండా ఈ క్షణాన్ని ఎలా అందంగా మలుచుకోవాలో ఆలోచిస్తారు. చేసే ప్రతిపనిలో వీరి ప్రత్యేకత ఉంటుంది. జీవితంలో ఏ జరిగినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. 

Also Read: తెలివిగా మోసం చేయడంలో ఈ 6 రాశులవారు దిట్ట - వీళ్లతో జర జాగ్రత్త!

మీనరాశి

మీన రాశి నీటికి సంకేతం. వీరిలో అంతర్ దృష్టి ఎక్కువ. కలలు కంటారు, వాటిని నిజం చేసుకుంటారు. తమ చుట్టూఉండే వ్యక్తులపట్ల, పరిసరాల పట్ల సున్నితంగా ఉంటారు. నిశ్శబ్ధ క్షణాల్లో ఆనందాన్ని వెతుక్కుంటారు. గడిచిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తీసుకురాలేం... రేపు ఏం జరుగుతుందో ఊహించలేం..ఈ క్షణాన్ని ఆస్వాదించాలి అనే ఆలోచనతో ఉంటారు. అందుకే మీనరాశివారు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు. అదే సమయంలో భవిష్యత్ ని అందంగా మలుచుకోవడంలోనూ సక్సెస్ అవుతారు.  

Also Read: పన్నెండు రాశుల్లో ఇదే బలమైన రాశి – ఆ రాశి ఏదో, ఎందుకు బలమైన రాశో మీకు తెలుసా?

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget