Cheapest Electric Scooter: దేశంలో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ Zelo Knight+ లాంచ్ - ధర వింటే మీరు షాక్ అవుతారు!
Cheapest Electric Scooter India: జెలో ఎలక్ట్రిక్, 100 కిలోమీటర్ల రేంజ్‌తో భారతదేశపు చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ నైట్+ ను విడుదల చేసింది. దాని ఫీచర్లు, రేంజ్ & బుకింగ్ వివరాల గురించి తెలుసుకుందాం.

Zelo Knight+ Price Price, Range And Features In Telugu: దేశీయ స్టార్టప్ కంపెనీ Zelo Electric, తన కొత్త & అత్యంత తక్కువ ధర ఎలక్ట్రిక్ స్కూటర్ Knight+ ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటివరకు భారతదేశంలో ఇదే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అని & ఖరీదైన స్కూటర్లలో సాధారణంగా కనిపించే అన్ని ముఖ్యమైన స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. తక్కువ బడ్జెట్‌లో మంచి పనితీరు & ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కోరుకునే కస్టమర్ల కోసం నైట్ ప్లస్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
ధర & ఫీచర్లు
Knight+ Electric Scooter లో ముందుగా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం 'తక్కువ ధరకే అందించే గొప్ప ఫీచర్లు'. కేవలం రూ. 59,990 ఎక్స్-షోరూమ్ ధరకే (Zelo Knight+ ex-showroom price) ఈ స్కూటర్ హిల్ హోల్డ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్ & USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అధునాతన ఫీచర్లతో (Zelo Knight+ Features) వచ్చింది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ కూడా ఉంది, ఇది బ్యాటరీ ఛార్జింగ్‌ను & నిర్వహణను సులభం చేస్తుంది. ఈ స్కూటర్ మెరిసిపోయే తెలుపు, నిగనిగలాడే నలుపు & డ్యూయల్-టోన్ ఫినిష్ వంటి 6 విభిన్న రంగులలో లభిస్తుంది, ఇవన్నీ ముఖ్యంగా యువతను ఆకర్షించే కలర్స్.
బ్యాటరీ, రేంజ్ & టాప్ స్పీడ్
జెలో నైట్+ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.8 kWh పోర్టబుల్ LFP బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 100 కి.మీ. వాస్తవ ప్రపంచ పరిధిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. నగర అవసరాలకు అనుగుణంగా దీని గరిష్ట వేగం గంటకు 55 కి.మీ.గా సెట్ చేశారు. ఎక్కువ రేంజ్, తగిన వేగం కారణంగా ఇది రోజువారీ ప్రయాణానికి మెరుగైన ప్రయాణ సాధానంగా మారింది. పెట్రోల్ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న వారికి & ఇప్పుడు విద్యుత్ వాహనాల వైపు వెళ్లాలనుకునే వారికి ఈ స్కూటర్ ఒక అద్భుతమైన ఎంపికగా మారవచ్చు.
డెలివరీ & బుకింగ్ వివరాలు
జెలో నైట్+ స్కూటర్ డెలివరీలు ఆగస్టు 20, 2025 నుంచి ప్రారంభం అవుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న జెలో డీలర్‌షిప్‌లలో దీని ప్రి-బుకింగ్ ప్రారంభమైంది. మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మంచి అవకాశం కావచ్చు.
నైట్+ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదని, భారతదేశంలో స్మార్ట్ & క్లీన్ మొబిలిటీని అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక పెద్ద అడుగు అని జెలో ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు ముకుంద్ బహేటి, లాంచ్ సందర్భంగా చెప్పారు. సామాన్యులకు కూడా ప్రీమియం క్వాలిటీ & అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ధరకు లభించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఈ ఆలోచనను దృష్టిలో ఉంచుకుని నైట్+ రూపొందించినట్లు వివరించారు.



















