అన్వేషించండి

Astrology: తెలివిగా మోసం చేయడంలో ఈ 6 రాశులవారు దిట్ట - వీళ్లతో జర జాగ్రత్త!

Zodiac Sign: కొందరేమో నీతి-నిజాయితీ అంటారు..మరికొందరు ఎవరు ఏమైనా మా పని మాకు అయితే చాలనుకుంటారు.. ఇంకొందరు అవసరాన్ని బట్టి వాస్తవాలకు పాతరేస్తారు.. మీ చుట్టూ ఉండేవారు ఏ కోవకు చెందుతారో గమనించారా?

 Astrology:  మీ మనస్తత్వం ఏంటో మీ జన్మరాశి చెప్పేస్తుందంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. కొందరు నమ్మకానికి కేరాఫ్ అడ్రస్ అయితే మరికొందరు మోసం చేసేందుకు తమలో క్రియేటివిటీ మొత్తంవెలికితీస్తుంటారు. అవసరానికి అబద్ధం చెప్పడం అస్సలు తప్పులేదన్నది వీరి అభిప్రాయం. వీరి ప్రవర్తన వల్ల ఎదుటివారికి హాని జరగదు ..తన స్వార్థ ప్రయోజనాలకోసం ఇలా ప్రవర్తిస్తుంటారు అంతే.. ఇలాంటి వారిలో  మీ రాశి ఉందా? మీ స్నేహితులు సన్నిహితుల్లో ఎవరి ప్రవర్తన అయినా ఇలానే ఉందా? 
 
మిథున రాశి (Gemini)

ఈ రాశివారిది పంచభూతాల్లో వాయుతత్వం. గాలికి నిలకడలేనట్టే వీరి మాటకు నిలకడ ఉండదు. మనిషి మారితే మాట మారిపోతుంది. అయితే తమ మాటతీరుతో ఎంతటివారినైనా కట్టిపడేయగలరు. నిజాయితీగా వ్యవహరించాలి అనుకుంటారు కానీ అది చాలాకష్టం అని ఆచరణంలో అర్థమవుతుంది. అందుకే పరిస్థితులకు తగ్గట్టుగా తమని తాము మార్చుకుంటారు. ఒక్కోసారి స్వార్థ ప్రయోజనాల కోసం ఎదుటివారిపై తప్పుడు ప్రచారం చేసేందుకు వెనుకాడరు.  

Also Read: రాఖీ కట్టించుకుంటే రోడ్డున పడాల్సిందే - రక్షాబంధన్ వేడుకలకు వీళ్లంతా దూరం!

కర్కాటక రాశి (Cancer)

ఈ రాశివారు అత్యంత తెలివైనవారు. తమ తెలివితేటలు, సృజనాత్మకతతో ఎదుటివారిని ఈజీగా బోల్తా కొట్టించేస్తారు. మాటలతో మాయ చేసి ఇతరులను ఆకర్షిస్తుంటారు. అందరి ముందూ తాము చాలా అద్భుతమైన వ్యక్తులం అన్నట్టు కనిపిస్తారు కానీ..అదంతా పైపై మెరుగులే. ఏ విషయాన్ని పూర్తిగా అర్థంచేసుకోకుండా తమ ఆలోచనకు అనుగుణంగా మార్చేసుకుంటారు. దీంతో ఎదుటివారిని ఈజీగా బోల్తా కొట్టించేస్తారు. వాస్తవాలను తారుమారు చేసేందుకు అస్సలు తగ్గరు.  

తులా రాశి (Libra)

సులభంగా అబద్ధాలు చెప్పేయడంతో తులా రాశివారు ముందుటారు. మాటల గారడీతో తొందరగా మాయ చేసేస్తారు. వీరి మాటతీరు, ప్రవర్తన ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా ఉంటుంది. తమ ప్రయోజనాలకోసం నిజాయితీగా నటిస్తారు కానీ...వారికి అవసరం అయినప్పుడు వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడరు. హోదా, గౌరవం కోసం తప్పుడు పనులు చేసేందుకు కూడా సిద్ధమైపోతారు. ఈ రాశివారి నిజస్వరూపం గుర్తించడం అత్యంత కష్టమైన విషయం. 

Also Read: రక్షాబంధన్ ఎలా మొదలైంది - రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!

వృశ్చిక రాశి (Scorpio)

ననిజాన్ని అబద్ధంగా..అబద్ధాన్ని నిజంగా మార్చడంలో వృశ్చికరాశివారు సిద్ధహస్తులు. మాటనే ఆయుధంగా సంధించి తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. తమ లక్ష్యాలను సాధించేందుకు వక్రమార్గంలో వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకుంటారు. వాస్తవాలకు పాతరేసి సొంత ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తారు. వీరిలో కనిపించని క్రూరత్వం ఉంటుంది.  

మీన రాశి (Pisces)

నీటి తత్వం ఉన్న ఈ రాశివారు నీళ్లు తాగినంత ఈజీగా అబద్ధం చెప్పేస్తారు. వీరిలో ఉండే సృజనాత్మకతతో ఎదుటివారిని ఇట్టే మోసం చేసేస్తారు. అవసరం అయితే తమ స్వార్థప్రయోజనాలకోసం ఎదుటివారిని ముంచేసేందుకు కూడా వెనుకాడరు. తమపై ఇతరులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయడం లేదని వారిని నమ్మించే ప్రయత్నం బలంగా చేస్తారు. అదే సమయంలో మోసం చేయడంలో తన ప్రమేయం లేదంటూ పరిస్థితులను క్రియేట్ చేయడంలో సిద్ధహస్తులు. ఈ రాశివారు చెప్పేది నిజమో, అబద్ధమో గుర్తించడం ఎదుటివారికి పెద్ద సవాలే.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PBKS vs RCB: పంజాబ్ బ్యాటర్లను నిలువరించిన బౌలర్లు, ఆర్సీబీకి మోస్తరు టార్గెట్- రివేంజ్‌కు ఇదే మంచి ఛాన్స్
పంజాబ్ బ్యాటర్లను నిలువరించిన బౌలర్లు, ఆర్సీబీకి మోస్తరు టార్గెట్- రివేంజ్‌కు ఇదే మంచి ఛాన్స్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
PBKS vs RCB: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP DesamAvesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP DesamYashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP Desm

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PBKS vs RCB: పంజాబ్ బ్యాటర్లను నిలువరించిన బౌలర్లు, ఆర్సీబీకి మోస్తరు టార్గెట్- రివేంజ్‌కు ఇదే మంచి ఛాన్స్
పంజాబ్ బ్యాటర్లను నిలువరించిన బౌలర్లు, ఆర్సీబీకి మోస్తరు టార్గెట్- రివేంజ్‌కు ఇదే మంచి ఛాన్స్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
PBKS vs RCB: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
MI vs CSK: నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
Digital Rape: ఐసీయూలో పేషెంట్‌పై డిజిటల్ రేప్ కేసులో నిందితుడు అరెస్ట్.. ఇంతకీ డిజిటల్ రేప్ అంటే ఏంటీ ?
ఐసీయూలో పేషెంట్‌పై డిజిటల్ రేప్ కేసులో నిందితుడు అరెస్ట్.. ఇంతకీ డిజిటల్ రేప్ అంటే ఏంటీ ?
Embed widget