'కంచి' ప్రత్యేకత ఏంటి..ఇక్కడ ఏం దర్శించుకోవాలి! మన దేశంలో సప్తమోక్షపురి క్షేత్రాల్లో కంచి ఒకటి కాంచి అంటే మొలనూలు (వడ్డాణం). భరతభూమికి ఇది నాభిస్థానం..అత్యంత విశిష్టమైన శక్తిక్షేత్రం మోక్షవిద్యకు మూలపీఠం,అద్వైతవిద్యకు ఆధారస్ధానం..ఆదిశంకరాచార్యులు ముక్తిపొందిన క్షేత్రం శ్రీ కాంచీక్షేత్రం ఈ దేవాలయంలో కామాక్షిదేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కొలువుదీరి కనిపిస్తుంది 'కా' అంటే 'లక్ష్మి', 'మా' అంటే 'సరస్వతి', 'అక్షి' అంటే 'కన్ను'. కామాక్షి దేవి అంటే లక్ష్మి , సరస్వతిని కన్నులుగా కలదని అర్థం కంచి కామాక్షి ఆలయంతో పాటూ ఏకాంబరేశ్వర ఆలయం, వామన మూర్తి ఆలయం , వరద రాజ స్వామి ఆలయం దర్శించుకోవచ్చు పంచభూత లింగాల్లో పృథ్వీలింగం కొలువైన ప్రదేశం , అమ్మవారు తపస్సు చేసి ముక్తి పొందిన ప్రదేశం కాంచీపురం బల్లి పడిన దోషం నుంచి విముక్తి లభించాలంటే వదరరాజస్వామి ఆలయంలో ఉన్న బంగారుబల్లిని దర్శించుకోవాలి