అంతుచిక్కని రహస్యాలు కలిగిన 9 ఆలయాలు
కామాఖ్య దేవాలయం - గౌహతి - అస్సాం : అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో సతీదేవి యోనిభాగం పడింది
కేధార్ నాథ్ - ఉత్తరాఖండ్ : చార్ థామ్ యాత్రలో భాగంగా ఒకటైన కేదార్ నాథ్ ఆలయాన్ని ఎలాంటి ప్రకృతివైపరీత్యాలు ఏమీ చేయలేవు
జ్వాలాముఖి - హిమాచల్ ప్రదేశ్: అమ్మవారిని అగ్నిరూపంలో కొలిచే ప్రదేశం జ్వాలాముఖి..ఇది కాంగ్రా జిల్లాలో ఉంది. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని స్థలపురాణం
బృహదీశ్వర ఆలయం - తంజావూరు - తమిళనాడు: ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయం... ఇక్కడ గోపురం నీడ కనిపించకపోవడం మిస్టరీ
అనంతపద్మనాభస్వామ ఆలయం - కేరళ: అంతులేని సంపద, మిస్టరీలతో తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది
జగన్నాథ దేవాలయం - పూరి - ఒడిశా : సప్త మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటైన పూరీలో అంతుచిక్కని మిస్టరీలెన్నో..అందులో ఒకటి గాలికి వ్యతిరేక దిశలో జెండా ఎగురుతుంటుంది
మధుర మీనాక్షి - తమిళనాడు: ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్టించి ఉగ్రరూపిణి అయిన అమ్మవారిని శాంతస్వరూపిణిగా మార్చిన ఆలయం ఇది
మెహందీపూర్ బాలాజీ - రాజస్థాన్ : దౌసా అనే జిల్లా ఉన్న ఈ ఆలయంలో అడుగుపెడితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా పారిపోతుందని భక్తుల నమ్మకం..
వీరభద్రాలయం - లేపాక్షి - ఆంధ్రప్రదేశ్ : ఈ ఆలయంలో మండపానికి చెందిన ఓ స్తంభం గాల్లో తేలియాడుతూ ఉంటుంది..ఇదే ఇక్కడి మిస్టరీ..