శ్రావణ శుక్రవారం పూజలో బంగారం ఎందుకు!

శ్రావణమాసం శక్తి ఆరాధనకు అత్యంత ప్రత్యేకం

శ్రావణంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేస్తారు

ఈ రోజున అమ్మవారి కాసు(రూపు) కొనుగోలు చేసి పూజలో పెట్టి మెడలో వేసుకుంటారు

శ్రావణ శుక్రవారం పూజలో బంగారం ఎందుకు పెడతారో తెలుసా...

శ్రీవారి జన్మ నక్షత్రం పేరుమీద ఏర్పడిన శ్రావణం అంటే అమ్మవారికి ప్రీతికరం

ఐశ్వర్యానికి ప్రతీక అయిన మహాలక్ష్మిని బంగారంతో పూజిస్తే ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం

ఏటా కాసు కొనుగోలు చేయొచ్చు లేదంటే పాత కాసునే పాలు, నీళ్లు, పంచామృతాలతో శుభ్రం చేసి వినియోగించవచ్చు

భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం ఆచరించేవారి దాంపత్యం శ్రీ మహా విష్ణువు - లక్ష్మీదేవి అంత అన్యోన్యంగా ఉంటుందట

కోరిన వరాలిచ్చే వరలక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం, ఆయుష్షు, సంతానం, ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం
Images Credit: Pixabay