శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఇలా చేసుకోండి!

అమ్మవారి రూపు ఉంటే అందంగా అలంకరణ చేసుకోండి..కలశం పెట్టే అలవాటు లేకపోతే అమ్మవారి ఫొటోకి పూజచేసుకోవచ్చు

ఆచమనీయం, సంకల్పం, కలశారాధన అయ్యాక పసుపు వినాయకుడి పూజ చేయాలి

మళ్లీ ఆచమనీయం చేసి అమ్మవారికి షోడసోపచార పూజ పూర్తిచేయాలి

అంగపూజ, అష్టోత్తరం, కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం, ధూపదీపనైవేద్యాలు సమర్పించాలి

వరలక్ష్మీవ్రతంలో ముఖ్యమైనవి తోరం. 9 దారాలు తీసుకుని 9 పూలు పెట్టి తోరం తయారు చేసుకోవాలి

తోరం పూజ తర్వాత తోరం తీసి కట్టుకుని వ్రత కథ చెప్పుకుని..ముత్తైదువలకు వాయనాలు ఇవ్వాలి

ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇలాగే పూజచేసుకోవచ్చు.. తోరం , పీఠం, కలశం ఉండదు అంతే..

మిగిలిన రోజుల్లో వినాయక పూజ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు..వినాయక ప్రార్థన చాలు