తిరుమలలో ఈ తప్పులు చేయొద్దు!

ప్రతి క్షేత్రానికి కొన్ని నిమమాలుంటాయి..అవి పాటించినప్పుడే అక్కడ స్వామివారి కరుణ మీపై ఉంటుంది

తిరుమల క్షేత్రంలో కూడా ఈ నియమాలు పాటిస్తేనే దర్శనం చేసుకున్న పుణ్యం లభిస్తుంది

తిరుమల క్షేత్రంలో కొలువైనప్పుడు వరాహస్వామికి 3 వాగ్ధానాలు చేసి ప్రమాణపత్రం రాసిచ్చాడు వేంకటేశ్వరుడు

మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం నీకే ఇస్తానని మాటిస్తూ ఆ శాసనంలో ఉంది

అందుకే వరాహస్వామికన్నా ముందు వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే ఆ ఫలితం దక్కదు..

లౌకిక సుఖాల కోసం తిరుమల క్షేత్రానికి ఎప్పుడూ వెళ్లకూడదు , కొండపై బ్రహ్మచర్యం పాటించండి

దేవస్థాన నియమాలు పట్టించుకోకుండా దొంగ దర్శనాలు చేసుకోవద్దు

తిరుమల కొండ మొత్తం శాలగ్రామ శిల..కనీసం మాడవీధుల్లో అయినా పాదరక్షలతో నడవకండి

కొండపై పూలు అమ్మకూడదు, కొనుక్కుని పెట్టుకోకూడదు..ఏడు కొండలపై ప్రతి పూవూ శ్రీవారి సొంతం...

ఈ నియమాలు పాటించి శ్రీవారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయి
Image Credit: Pinterest