లక్ష్మీదేవికి ఇచ్చే తాంబూలంలో ఏం ఉండాలి!



పూజలో భాగంగా నైవేద్యం అనంతరం తాంబూలం సమర్పిస్తాం



తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ శ్లోకం చదువుతారు



పూగీఫలైస్స కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతమ్
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్



అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో ఏం ఉండాలో ఈ శ్లోకంలోనే ఉంది



పూగీ ఫలం అంటే వక్క .. కర్పూరం అంటే పచ్చ కర్పూరం



నాగవల్లీ దళం అంటే తమలపాకు..ముక్తా చూర్ణం అంటే సున్నం



ఈ నాలుగింటిని కలపి తాంబూలం సమర్పించాలి



ఇవేం లేనప్పుడు అక్షింతలు తీసుకుని తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి అని వేయాలి



అమ్మవారి/అయ్యవారి ఆరాధనలో విధానం కన్నా భక్తి ప్రధానం...