Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష'లో మంటలే... అభిజిత్ ఆన్ ఫైర్... సిద్దిపేట్ మోడల్ అవుట్!
Bigg Boss Agnipariksha OTT Streaming: ఆగస్టు 22 లేదా 23వ తేదీ నుంచి 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆల్రెడీ అందుకు సంబంధించి షూటింగ్ మొదలైంది.

Bigg Boss Agnipariksha Show Details: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 చాలా కొత్తగా ఉండబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోల్ని చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. ఈ సారి రెండు బిగ్ బాస్ హౌస్‌లు ఉంటాయని తెలిసింది. ఒకటి సెలెబ్రిటీల కోసం... ఇంకోటి కామనర్స్ కోసం అని సమాచారం. అందులో ఉన్న వాళ్లు ఇందులోకి... ఇందులో ఉన్న వాళ్లు అందులోకి వెళ్తారా? అసలు ఆట ఎలా ఆడిస్తాడు? ఏకంగా ఈ సారి బిగ్ బాస్‌నే మార్చాను అంటూ నాగార్జున మీద వదిలిన ప్రోమో ఇప్పటికే ఆసక్తికరంగా మారింది.
జియో హాట్ స్టార్‌లో వచ్చే వారం నుంచి అగ్ని పరీక్షకు సంబంధించిన ఎపిసోడ్స్ రానున్నాయని సమాచారం. అగ్నిపరీక్ష అంటూ కామన్ ఆడియెన్స్ వచ్చిన కొంత మందిని ఇంట్లోకి పంపించేందుకు ప్రాసెస్ స్టార్ చేసిన సంగతి తెలిసిందే. అభిజీత్, నవదీప్, బిందు మాధవి జడ్జ్‌లుగా ఉండి... 40 మంది కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తున్నారట. ఒక్కొక్కొరు ఒక్కో కంటెస్టెంట్‌కి బ్యాడ్జ్‌లు ఇస్తారట.
జడ్జిలలో అలా ఏ కంటెస్టెంట్‌కి అయితే మూడు బ్యాడ్జ్‌లు వస్తాయో వారు సెలెక్ట్ అయినట్టు. ఒక్క బ్యాడ్జ్ మాత్రమే వస్తే వారిని హోల్డ్‌లో పెడతారట. ఏ బ్యాడ్జ్ రాకపోతే స్పాట్‌లో బయటకు పంపించేస్తున్నారట. అలా చాలా మంది బయటకు వచ్చారట. సిద్దిపేట్ మోడల్ అలా ఏ బ్యాడ్జ్ సంపాదించుకోలేక బయటకు వచ్చారట. నేహా, మహ్మద్ సమీర్, ట్రాన్స్ అంకిత, యాంకర్ మల్లీశ్వరి, శ్రియా ఇలా అందరూ బయటకు వచ్చారట.
Also Read: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!
టోటల్ 44 మందిలో 15 మందిని సెలెక్ట్ చేశారట. అభిజిత్, నవదీప్, బిందు మాధవి టీమ్స్ లోంచి ఐదుగురు చొప్పున చివరకు 15 మందిని తీసుకున్నారట. ఇందులోంచి ఒక్కో టీంలోని మెంబర్ ఒక మెంబర్ మాత్రం కచ్చితంగా ఇంట్లోకి అడుగు పెడతారట. మిగిలిన వాళ్లలో ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా మరో ముగ్గురు ఇంట్లోకి అడుగు పెడతారట. అలా మొత్తంగా ఆరుగురు కామనర్స్ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉందట.
ఈ ప్రాసెస్‌లో ఓ కంటెస్టెంట్ మీద అభిజిత్ అరిచేశాడట. దమ్ము శ్రీజ అనే అమ్మాయికి అభిజిత్ క్లాస్ పీకాడట. ఇంటర్వ్యూలో ఏదో కాస్త తేడా జరిగిందట. అందుకే ఆమె మీద అభిజిత్ ఫైర్ అయ్యాడట. ఊర్మిళ చౌహాన్ అనే వ్యక్తికి నవదీప్ మాత్రమే బ్యాడ్జ్ ఇచ్చారట. ఇలా మొత్తంగా అగ్నిపరీక్షకు సంబంధించిన లీకులు మాత్రం ఇప్పుడు బాగానే వైరల్ అవుతున్నాయి.
Also Read: 'బిగ్ బాస్ 9'లో సామాన్యులకు అగ్ని పరీక్ష... టీవీలో కాదట - మెయిన్ ట్విస్ట్, మార్పు ఏమిటో తెలుసా?





















