Bigg Boss 9 Telugu: తెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!
Bigg Boss 9 Telugu Contestants: 'బిగ్ బాస్' తెలుగు లేటెస్ట్ సీజన్ ప్రిపరేషన్ వర్క్ మొదలు అయ్యింది. ఇందులో కంటెస్టెంట్స్ పేర్లు అఫీషియల్‌గా బయటకు రాలేదు. అయితే ఓ కన్నడ హీరోయిన్ పేరు బలంగా వినబడుతోంది.

'బిగ్ బాస్' తెలుగు కొత్త సీజన్ మొదలు కావడానికి కొంత సమయం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 9 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి షో మొదలు అవుతుంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ చేయనున్నారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు ఎక్కువ మందిని బిగ్ బాస్ ఇంటిలోకి తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. కంటెస్టెంట్లలో ఒక కన్నడ హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలిసింది.
'గుర్తుందా శీతాకాలం' కావ్య శెట్టి...
లాస్ట్ ఇయర్ మిస్ ఈసారి కన్ఫర్మ్!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, టాలెంటెడ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' సినిమా గుర్తు ఉందా? అందులో అమృత పాత్రలో నటించిన కన్నడ కథానాయిక కావ్య శెట్టి గుర్తు ఉన్నారా? సినిమా అంతగా ఆడలేదు కనుక గుర్తుండే అవకాశం తక్కువ లెండి. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ప్రస్తావన ఎందుకు అంటే...
'బిగ్ బాస్' తెలుగు కొత్త సీజన్ కంటెస్టెంట్ల లిస్టులో (Bigg Boss Telugu 9 Contestants) కావ్య శెట్టి పేరు బలంగా వినబడుతోంది. నిజం చెప్పాలంటే... గత ఏడాది బిగ్ బాస్ తెలుగులో ఆవిడ పార్టిసిపేట్ చేయాల్సి ఉందంట. అయితే అప్పుడు కుదరలేదు. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యిందని, ఈసారి మాత్రం మిస్ అయ్యే ఛాన్స్ లేదని, గ్యారంటీగా ఆవిడ షోలో సందడి చేస్తారని తెలిసింది.
View this post on Instagram
తెలుగులో 'గుర్తుందా శీతాకాలం' సినిమా ఒక్కటే చేశారు కావ్య శెట్టి. కానీ కన్నడలో ఆవిడ చాలా సినిమాలలో నటించారు. తమిళ, మలయాళ సినిమాలలో కూడా మెరిశారు. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు.
'సత్యభామ' హీరోయిన్....
షోలో బెంగాలీ నటి సందడి!
'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇంకా ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు స్టార్ మా టీం. సెలబ్రిటీలు కొందరితో డిస్కషన్స్ జరుగుతున్న మాట వాస్తవం. అందులో సీరియల్ నటి దెబ్జానీ పేరు కూడా ఉందట. ఆవిడ పార్టిసిపేట్ చేసే ఛాన్సులు ఎక్కువ. వీజే సన్నీ, మానస్ నాగులపల్లి వంటి ఓల్డ్ సీజన్ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చే అవకాశం ఉంది.
Also Read: జయం సీరియల్ టీఆర్పీ రేటింగ్... ఫస్ట్ వీక్ ఎంత వచ్చింది? 'జీ తెలుగు'లో ఎన్నో ప్లేసులో ఉంది?
'సత్యభామ' సీరియల్ ద్వారా తెలుగులో దేబ్జాని పాపులర్ అయ్యారు. ఆ తరువాత స్టార్ మా రియాల్టీ షోలు 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2'తో పాటు 'స్టార్ మా పరివారం విత్ ఆదివారం'లో పార్టిసిపేట్ చేశారు. ఆవిడ బెంగాలీ అయినప్పటికీ తెలుగులో క్యూట్ క్యూట్ స్పీచ్ ఇస్తూ వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. 'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన ఇమ్మానుయేల్, నటి రీతు చౌదరి, ఐశ్వర్య నుంచి యూట్యూబర్ 'బం చిక్' బబ్లూ సైతం కంటెస్టెంట్ల లిస్టులో ఉన్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్షకంచెర్ల సైతం షోలో సందడి చేసే అవకాశం ఉందట.
Also Read: దమ్ముంటే తిరిగి కొట్టండి... నెగిటివ్ రివ్యూలు, బాయ్‌కాట్ ట్రెండ్‌పై అభిమానులకు పవన్ కళ్యాణ్





















