AP MLC Elections: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. దాదాపు అన్నీ క్లీన్ స్వీపే!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మెుదలైంది. అధికార వైఎస్ఆర్సీపీ.. తమ అభ్యర్థులను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అభ్యర్థులపై కసరత్తు చేసింది. మొత్తం 14 స్థానాలు ఖాళీలు ఉండగా.. చాలా మంది ఆశావహలు ఎదురుచూశారు. వైసీపీ అధిష్టానం.. జిల్లాల వారీగా నేతల వడబోతను చేపట్టింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తోంది. మరోవైపు కొందరి పేర్లు ఖరారు అయ్యాయి. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థులను బుధవారం (నవంబర్ 10)వ తేదీన వైఎస్ఆర్సీపీ ఖరారు చేసింది.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం), కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ బాషా, కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి పేర్లను వైసీపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పు కాపు సామాజిక వర్గమైన పాలవలస శ్రీకాంత్, కర్నూలు జిల్లాలోని నంద్యాల నుంచి మైనార్టీ ఇషాక్ బాషా, కడప జిల్లాలోని బద్వేల్ నుంచి రెడ్డి సామాజిక వర్గంలో డీసీ గోవింద రెడ్డి పేర్లను సజ్జల ప్రకటించారు.
అయితే మిగిలిన 11 స్థానాలకు సంబంధించిన వారి పేర్లు కూడా పూర్తైనట్టు సమాచారం. కృష్ణా జిల్లా నుండి తలశీల రఘురాం, డాక్టర్ మెహబూబ్ షేక్, దుట్టా రామచంద్రయ్య, యార్లగడ్డ వెంకట్రావు ఉండగా.. గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి, మర్రి రాజశేఖర్, జియఉద్దీన్ పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుండి విక్రాంత్, ప్రకాశం నుంచి రావి రామనాథబాబు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ అధికారికంగా ప్రకటించలేదు.
అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీదే పూర్తి మెజార్టీ ఉండటంతో ఈ 14 స్థానాల్లోనూ విజయం నల్లేరుపై నడకే అని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. దాదాపు అన్ని కూడా ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే క్యాండిడేట్ల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది హైకమాండ్. అన్ని ఈక్వేషన్స్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు.
Also Read: Ap Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 348 కరోనా కేసులు.. వైరస్ కారణంగా ముగ్గురు మృతి
Also Read: AP Employees : పీఆర్సీ నివేదిక కోసం ఆందోళన..ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతల మెరుపు ధర్నా !
Also Read: JC Paritala : పరిటాల - జేసీ ఆత్మీయ పలకరింపు..అనంతపురం టీడీపీ నేతలకు స్వీట్ షాక్ !