Ap Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 348 కరోనా కేసులు.. వైరస్ కారణంగా ముగ్గురు మృతి
ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 348 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో 41,244 పరీక్షలు చేయగా.. 348 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వైరస్ కారణంగా చనిపోయారు. కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,406కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 358 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,51,440 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,220 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 10/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 10, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,66,171 పాజిటివ్ కేసు లకు గాను
*20,48,545 మంది డిశ్చార్జ్ కాగా
*14,406 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,220#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0fMSFwbjxT
భారత్ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. కొత్తగా 12,78,728 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతక్రితం రోజుకంటే కేసుల్లో 13 శాతం మేర పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 460 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ భారత్‌లో 3.43 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.37 కోట్లకు పైనే ఉంది. నిన్న ఒక్కరోజే 11,961 మంది కోలుకున్నారు.
మరోవైపు భారత్ తయారు చేసిన టీకాలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోంది. కొవిడ్ సర్టిఫికెట్ల పరస్పర అంగీకారానికి ఇప్పటి వరకు 96 దేశాలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 8 వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే.. అందులో రెండు (కొవిషీల్డ్, కొవాగ్జిన్) టీకాలు భారత్కు చెందినవి ఉండటం గర్వకారణం అన్నారు.
ఇక ఈజీగా..
భారత్‌లో తయారైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వేసుకున్న ప్రజలు ఈ దేశాలకు ఇక ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రయాణించవచ్చు. కేవలం వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కొవిన్ యాప్ ద్వారా సులభంగా సర్టిఫికేట్‌ను తీసుకోవచ్చు. కొవిన్ యాప్లో ఈ దేశాల జాబితా అందుబాటులో ఉందని మన్‌సుఖ్ తెలిపారు.
Also Read: COVID Vaccination Certificate: భారత్ టీకాలు తీసుకున్నారా బేఫికర్.. ఆ 96 దేశాలకు ఇక బ్యాగ్ సద్దేయండి!
Also Read: AP Employees : పీఆర్సీ నివేదిక కోసం ఆందోళన..ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతల మెరుపు ధర్నా !