COVID Vaccination Certificate: భారత్ టీకాలు తీసుకున్నారా బేఫికర్.. ఆ 96 దేశాలకు ఇక బ్యాగ్ సద్దేయండి!
భారత్ జారీ చేసే కొవిడ్ టీకా ధ్రువీకరణ పత్రానికి 96 దేశాలు ఆమోదం తెలిపాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
భారత్ తయారు చేసిన టీకాలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోంది. కొవిడ్ సర్టిఫికెట్ల పరస్పర అంగీకారానికి ఇప్పటి వరకు 96 దేశాలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 8 వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే.. అందులో రెండు (కొవిషీల్డ్, కొవాగ్జిన్) టీకాలు భారత్కు చెందినవి ఉండటం గర్వకారణం అన్నారు.
ఇక ఈజీగా..
భారత్‌లో తయారైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వేసుకున్న ప్రజలు ఈ దేశాలకు ఇక ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రయాణించవచ్చు. కేవలం వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కొవిన్ యాప్ ద్వారా సులభంగా సర్టిఫికేట్‌ను తీసుకోవచ్చు. కొవిన్ యాప్లో ఈ దేశాల జాబితా అందుబాటులో ఉందని మన్‌సుఖ్ తెలిపారు.
PM @NarendraModi जी के नेतृत्व में #HarGharDastak अभियान के तहत टीकाकरण अभियान तेज गति से चल रहा है।
— Office of Dr Mansukh Mandaviya (@OfficeOf_MM) November 9, 2021
96 देशों ने भारत की दोनों वैक्सीन को मान्यता दी है। आने वाले समय में और भी देश दोनों वैक्सीन को मान्यता दें इसके लिए प्रयास जारी है।
📖 https://t.co/Q2HvItVdUw pic.twitter.com/TN8TXmWTGu
మరిన్ని దేశాల్లో టీకా ధ్రువీకరణ పత్రానికి గుర్తింపు కోసం భారత్ ప్రయత్నిస్తోందని మాండవీయ స్పష్టం చేశారు. భారత టీకాలకు గుర్తింపునిచ్చిన దేశాలకు వెళ్తే ప్రయాణ ఆంక్షలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించింది. అంతకుముందు ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా కొవాగ్జిన్ టీకాను ఆమోదించాయి.
Also Read: Farmer Protest Tractor March: పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మార్చ్.. రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతం
Also Read: Padma Awards 2021: పండ్ల వ్యాపారికి పద్మశ్రీ.. వాట్ ఏన్ ఐడియా బాబాయ్.. నీకు 'దేశం' సలాం!
Also Read: Online Term Plan: ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి