అన్వేషించండి

YSR Raithu Barosa: రైతుల ఖాతాల్లోకి రూ.2,204 కోట్లు - రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

CM Jagan: వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో వేశారు. 53.53 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.2,204 కోట్ల సాయాన్ని జమ చేశారు.

Raithu Bharosa Funds: రాష్ట్రంలో ఈ ఏడాది రెండో విడత రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం మధ్యాహ్నం బటన్ నొక్కి ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున రూ.2,204 కోట్లను 53.53 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో వేశారు. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా  రైతు భరోసా కింద రూ.13,500 రైతు భరోసా సాయం అందిస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.33,209.81 కోట్లు రైతన్నలకు అందించినట్లు సీఎం జగన్ తెలిపారు.

ఐదో ఏడాది ఇప్పటికే మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సాయం అందించిన జగన్‌ సర్కార్‌... ఇవాళ రెండో విడతగా రూ.4,000 అందించింది. వైఎస్సార్ రైతు భరోసా-సీఎం కిసాన్‌ కింద... ఏటా 3 విడతల్లో రూ.13,500 అందిస్తోంది. ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500, అక్టోబర్- నవంబర్ నెల ముగిసే లోపే ఖరీఫ్ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి - ఫిబ్రవరి నెలలో రూ.2,000 అందిస్తోంది. 

చంద్రబాబుపై విమర్శలు

చంద్రబాబు హయాంలో పేదల గురించి ఆలోచించలేదన్నారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కామేనని ఆరోపించారు. రైతులు ఇబ్బంది పడకూడదనే ముందుగా నిధులు ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. చంద్రబాబు హయాంలో ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారాయన. స్కీమ్‌ల గురించి కాకుండా... స్కాముల గురించి చంద్రబాబు ఆలోచించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో వ్యవసాయం, చదువులు, ఆరోగ్యం... ఏ రంగంలో అయినా... కనీ వినీ ఎరుగని మార్పులు తెచ్చామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కూడా తెచ్చామన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం, ఉచిత పంట బీమా ఇస్తున్నామన్నారు. రైతులపై భారం లేకుండా పూర్తి ప్రీమియం బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని బీమా రక్షణ అందిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో బీమా క్లెయిమ్లు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో. ఎంతమందికి వస్తాయో కూడా తెలియని దుస్థితి ఉండేదన్నారు. ప్రీమియం సైతం రైతు చెల్లించాల్సి వచ్చేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పంట నష్ట పరిహారం ఈ-క్రాప్ డేటా ఆధారంగా శాస్త్రీయంగా పంట నష్టాలు అంచనా వేసి ఏ సీజన్ పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తున్నామని చెప్పారు.  మీ ఇంట్లో మేలు జరిగి ఉంటే.. మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Yanam Jesus statue: యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
Ind Vs Aus Test Series: జట్టును ప్రకటించిన ఆసీస్, జట్టులో రెండు మార్పులు.. ఫిట్ గా మారి వచ్చిన స్టార్ బ్యాటర్
జట్టును ప్రకటించిన ఆసీస్, జట్టులో రెండు మార్పులు.. ఫిట్ గా మారి వచ్చిన స్టార్ బ్యాటర్
Embed widget