YSRCP On Nara Lokesh : టీడీపీ హయాంలోనే బీసీలపై ఎక్కువ దాడులు - లోకేష్‌పై వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఫైర్ !
టీడీపీ హయాంలోనే బీసీలపై ఎక్కువ దాడులు జరిగాయని వైసీపీ ఎంపీలు ఆరోపించారు. ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడారు.
YSRCP On Nara Lokesh : తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీ వర్గాల పై దాడులు జరిగితే అప్పుడు లోకేష్ ఏమి చేశారో చెప్పాలని వై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ప్రశ్నించారు. ఢిల్లీలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒంగోలులో జయహో బీసీ సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని రాజ్యసభ సభ్యులు ఖండింారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి.. అవాస్తవాలను ప్రచారం చేయడంతో టీడీపీ నాయకుడు నారా లోకేష్ తండ్రిని మించిపోతున్నారని ఆరోపించారు.
హత్యకు గురైన పదో తరగతి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకున్నది వైఎస్ జగనే !
ప్రకాశం జిల్లా ఒంగోలులో నారా లోకేష్ 'జయహో బీసీ' సదస్సు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విమర్శించారు. వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తున్న నారా లోకేష్, టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఎంపీలు ఖండించారు. బీసీలను టీడీపీ ఉద్దరించినట్లు నారా లోకేష్ ఊదరగొడుతున్నారని ఎంపీ మోపిదేవి వెంకట రమణ మండిపడ్డారు. ఇటీవల రేపల్లెలో జరిగిన ఓ సంఘటనను అడ్డంపెట్టుకుని లోకేష్ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రేపల్లెకు చెందిన అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడిని హత్య చేస్తే .. అతని కుటుంబాన్ని ఆదుకున్నది సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నాన్నారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.10లక్షలు ప్రభుత్వ సాయం, ఒక రూ.లక్ష వ్యక్తిగత సాయంతోపాటు.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్ల స్థలం, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. బాధిత కుటుంబంలోని ఆ చిన్నపిల్లను రెచ్చగొట్టి ఏవేవో మాట్లాడించాలని లోకేష్ ప్రయత్నించడం సిగ్గుచేటని ఎంపీ మోపిదేవి అన్నారు.
ఏఎన్‌యూలో రిషితేశ్వరి చనిపోతే లోకేష్ ఎక్కడున్నారు ?
టీడీపీ హయాంలో రిషికేశ్వరి అనే అమ్మాయి ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చనిపోతే కనీసం చంద్రబాబు, లోకేష్ ఎవరూ పరామర్శించిన పాపానపోలేదన్నారు. ఆ రోజు లోకేష్ ఎక్కడ నిద్రపోతున్నాడో చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో బీసీల సాధికారత, వారు ఆర్థికంగా సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఏం చేశారో చెప్పాలని ఎంపీ మోపిదేవి డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఎదిగేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం కల్పించారని ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు , అసెంబ్లీ స్పీకర్ బీసీకి కేటాయించడం, కేబినెట్‌లో దాదాపు 11 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని, రాజ్యసభకు బీసీలను ఏనాడు టీడీపీ ఒక్కరిని కూడా పంపిన సందర్భాలు లేవనdvejg.
బీసీలకు పదవులు ఇస్తున్నది జగనే !
సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారన్నారు. లోక్‌సభలో ఆరుగురు బీసీలు ఎంపీలుగా ఉన్నారని, ఇక 31 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, 56 బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, 9 మంది జడ్పీ ఛైర్మన్లు, 9 మంది మేయర్లు, 215 మంది జడ్పీటీసీలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారంటే ఈ సామాజిక వర్గాలపై సీఎం జగన్‌కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి గత టీడీపీ హయాంలో బడ్జెట్‌లో 16వేల కోట్లు కేటాయిస్తే.. 82 వేల కోట్లు వైసీపీ హయాంలో కేటాయించామన్నారు. రూ.1.60 వేల కోట్లు వివిధ సంక్షేమ పథకాల రూపంలో బీసీలకు ఇచ్చామన్నారు.