News
News
వీడియోలు ఆటలు
X

వైజాగ్ జైలులో పెరుగుతున్న స్టూడెంట్ నెంబర్ వన్ లు

వైజాగ్ సెంట్రల్ జైలులో పెరుగుతున్న చదువుకునే ఖైదీల సంఖ్య

10th నుంచి పీజీ వరకూ చదువుతున్న ఎంతో మంది ఖైదీలు  

జైలును శిక్షలా కాకుండా శిక్షణలా భావిస్తున్న ఖైదీలు 

FOLLOW US: 
Share:

 మీకు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా గుర్తు ఉంది కదా.  అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క జైలు శిక్ష అనుభవిస్తూనే మరోప్రక్క లా చదువుతాడు. ఇప్పుడు విశాఖ సెంట్రల్ జైలులో అలా శిక్ష అనుభవిస్తూనే చదువుకుంటున్న వారిసంఖ్య పెరుగుతోంది. ఇందులో కో ఇన్సిడెంట్ ఏంటంటే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో జూనియర్ చదివేది కూడా విశాఖ జైలులోనే కావడం. 

క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైలుకు వచ్చే వారు  ఎందరో

 ఆవేశంలో నేరాలకు పాల్పడి జైలు పాలయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారిలో  తమ జీవితం ఇక జైలుపాలే అనుకోకుండా చదువుకుని రిలీజ్ అయ్యాక మెరుగైన జీవితం గడపాలనుకునే వారు చదువుపై దృష్టిపెడుతున్నారు. జైలు అధికారులు కూడా వారికి చదువుకునే అవకాశం కల్పించడంతో పాటు దానికి తగ్గ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దానితో ఒక పక్క జైలులో రకరకాల పనులు చేసుకుంటూనే మరోపక్క చదువుకునే వారు ఎక్కువ అవుతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. వారిలో 10th క్లాస్ నుంచి డిగ్రీ ,పీజీల వరకూ చదువుతున్న వారున్నారు. ఈ  అకాడమిక్ ఇయర్ పరీక్షలు రాసినవారు 23 మంది ఉన్నారు. వీరు కాకుండా కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నవారు మరో 50 మంది వరకూ ఉన్నారు. గతంలో అంటే 2019-20లో 29 మంది, 2020-21లో 32 మంది , 2021-22 లో 17 మంది విశాఖ జైలు నుంచి తమ తమ చదువులు పూర్తి చేశారు. 2010లో అయితే లైఫ్ ఇంప్రెజన్మెంట్ శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ పీజీలో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించాడు . 

ఖైదీలకోసం ఒక లైబ్రరీ -జ్ఞాన సాగరం

 ఈ జైలులో శిక్షలు పడినవారు, రిమాండ్ లో ఉన్నవారు తమ చదువు పాడు కాకుండా కొనసాగించే అవకాశం ఉంది. వారే కాదు అస్సలు చదువులేని వారు కూడా జైల్లో ఉంటారు. అలాంటి వారికోసం అడల్ట్ ఎడ్యుకేషన్ కింద చదువు చెబుతున్నారు. వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ వరకూ చదువుకుంటున్నారు. డిగ్రీ ,పీజీలు చదివేవారికి క్లాసులు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా జైలు రిక్రూట్మెంట్ లో భాగంగా అపాయింట్ అయిన టీచర్ ఒకరు ఉంటారు. ఉదయం 8 నుంచి 11 వరకూ , మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకూ ఖైదీలకు క్లాసులు ఉంటాయి. ఎగ్జామ్స్ టైంలో ఏయూ నుంచి వచ్చిన ప్రతినిధులే ఇన్విజిలేషన్ చేస్తారు. అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో టెక్నికల్, కంప్యూటర్ ట్రైనింగ్ లు అందిస్తారు. ఇక ఈ జైలులో ఖైదీల కోసం "జ్ఞాన సాగరం " పేరుతో ప్రత్యేక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఏదేమైనా విశాఖ జైలులోని ఖైదీలకు చదువు పట్ల ఆసక్తి కలిగించడం లో అధికారులు తీసుకుంటున్న చర్యలు సక్సెస్ కావడంతో అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 

Published at : 23 Apr 2023 06:38 PM (IST) Tags: Students AP News VIZAG Prisoners Central jail eduction

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

YS Viveka Case : సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !

YS Viveka Case :  సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

TTD News: తిరుమల శ్రీవారికి రష్యా భక్తుడి భారీ విరాళం - రూ.7.6 లక్షల అందజేత!

TTD News: తిరుమల శ్రీవారికి రష్యా భక్తుడి భారీ విరాళం - రూ.7.6 లక్షల అందజేత!

టాప్ స్టోరీస్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్