Vizag MLA Winner List 2024: విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన అభ్యర్థులు వీళ్లే
Vizag Constituency MLA Winner List 2024: రాజధాని పేరు చెప్పుకున్నా విశాఖలో వైసీపీని ఆదరణ దొరకలేదు. ప్రతిపక్షం మాటలను నమ్మినట్టే కనిపిస్తోంది. అక్కడ రెండు ప్రాంతాల్లోనే వైసీపీ లీడ్ కనిపిస్తోంది.
Vizag Assembly Election Results 2024 MLA Winners List: సాగర తీరంలో కూటమి గాలి వీచింది. రాజధాని పేరు చెప్పినా వైసీపీకి ప్రయోజనం లేకపోయింది. సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం వైజాగ్‌లోనే చేస్తాను అన్న జనం పట్టించుకోలేదు. జగన్‌ను కాదని కూటమికే ఓటర్లు పట్టం కట్టారు.
నియోజకవర్గం |
ఆధిక్యంలో ఉన్న అభ్యర్థి | విజయం సాధించిన అభ్యర్థి |
భీమిలి |
గంటా శ్రీనివాస్‌రావు | |
విశాఖ ఈస్ట్ |
వెలగపూడి రామకృష్ణబాబు | |
విశాఖ వెస్ట్ |
గణబాబు | |
విశాఖ సౌత్ |
వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్(జనసేన) | |
విశాఖ నార్త్ |
విష్ణుకుమార్ రాజు | |
గాజువాక |
పల్లా శ్రీనివాసరావు |
2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా విశాఖపట్నం(Vizag)లో మాత్రం ఆ పార్టీ ఇప్పటికీ బోణీ కొట్టలేకపోయిందంటే...తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆది నుంచి తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న విశాఖ జిల్లాలో 2009 కాంగ్రెస్(Congress) ప్రభావం చూపింది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందిబి మోగించింది.
2014లో విశాఖ(Vizag) లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సీట్లను పొత్తులో భాగంగా బీజేపీ(BJP)తో కలిసి క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం అసెంబ్లీ సీట్లతోపాటు విశాఖ లోక్‌సభ అభ్యర్థి బీజేపీ(BJP) విజయం సాధించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్(Jagan) హవా నడిచినా విశాఖలో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కేవలం రెండు సీట్లు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ముఖ్యంగా విశాఖ నగరంలో ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. ఇక్కడ నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం విశేషం.
బహుశా చంద్రబాబు(Chandrababu) హయాంలో విశాఖలో జరిగిన అభివృద్ధిని వారు కళ్లారా చూడటం, అంతర్జాతీయ సంస్థలు రావడం, ఐటీ గ్రోత్ పెరగడం, పారిశ్రామిక సదస్సులు నిర్వహించడం...ఒకటేమిటి తెలుగుదేశం హయాంలో ఏ పెద్ద ఈవెంట్ జరిగినా ముందుగా గుర్తుకు వచ్చేది విశాఖ పేరే. అందుకే నగరవాసులు తెలుగుదేశానికి పట్టం కట్టారు. కానీ జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Laxminarayana) బరిలో నిలవడంతో ఎంపీ సీటుకు గట్టిపోటీ వచ్చింది. పెద్దఎత్తున తెలుగుదేశం ఓట్లు చీలిపోవడంతో ఆ పార్టీ అభ్యర్థి శ్రీభరత్స్వ ల్ప తేడాతో ఎంపీ సీటు కోల్పోయారు, రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి వైసీపీ లాభపడింది. విశాఖ ఎంపీ సీటు జగన్ ఎగరేసుకుపోయారు.
|
2009 |
2014 |
2019 |
భీమిలి |
ప్రజారాజ్యం |
టీడీపీ |
వైసీపీ |
విశాఖ ఈస్ట్ |
టీడీపీ |
టీడీపీ |
టీడీపీ |
విశాఖ వెస్ట్ |
కాంగ్రెస్ |
టీడీపీ |
టీడీపీ |
విశాఖ సౌత్ |
కాంగ్రెస్ |
టీడీపీ |
టీడీపీ |
విశాఖ నార్త్ |