AP Assembly Election Results 2024 Live Updates: జనసేన పార్టీ కార్యాలయంలో చంద్రబాబుకి ఘన సత్కారం!
Andhra Pradesh Assembly Election Results 2024 Live Updates: APలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. APలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
LIVE
Background
Andhra Pradesh Assembly Election Results 2024 Live Updates: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వేళైంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మంగళవారం (జూన్ 4) కౌంటింగ్ ప్రక్రియకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి దాదాపు 4 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా.. వీటి లెక్కింపునకు ప్రత్యేక కౌంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తొలి ఫలితం అక్కడే
రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ రోజు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తాడిపత్రి, మాచర్ల, తిరుపతి నియోజకవర్గాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూండంచెల భద్రత ఉంటుందని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. మొత్తం 119 మంది పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించమని స్పష్టం చేశారు. మీడియాకు మాత్రం నిర్దేశించిన ఫోన్ల వరకూ తీసుకెళ్లవచ్చని సూచించారు. కాగా, తొలి ఫలితం నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో వెలువడనుంది. రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లతో చివరి ఫలితం రానుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసుకోవచ్చు. మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెల్లడయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.
సర్వత్రా ఉత్కంఠ
రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. 26,473 మంది హోం ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు, ఎన్నికల ఫలితంపై అధికార వైసీపీ, టీడీపీ - బీజేపీ - జనసేన అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం కొన్ని సంస్థలు అధికార వైసీపీదే అధికారమని.. సీఎం జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని అంచనా వేశాయి. మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమిదే అధికారమని.. చంద్రబాబు సీఎం కాబోతున్నారని తేల్చాయి. ఈ క్రమంలో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై అధికార వైసీపీ సహా, టీడీపీ కూటమి నేతలు సైతం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు, జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గం మరింత ఆసక్తిని రేపుతోంది. ఇక్కడ వైసీపీ తరఫున వంగా గీత బరిలో నిలిచారు. అటు, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మెజార్టీపైనా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
AP Election Results 2024 LIVE Updates: జనసేన పార్టీ కార్యాలయంలో చంద్రబాబుకి ఘన సత్కారం!
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక స్వాగతం పలికారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ , శ్రీమతి అనా, తనయుడు అకీరా నందర్ చంద్రబాబుని ఘనంగా సత్కరించారు.
AP Election Results 2024 LIVE Updates: మా కుటుంబానికి గర్వకారణమైన రోజు - పవన్ విజయంపై చరణ్ రియాక్షన్
జనసేన అధినేత, బాబాయ్ పవన్ కళ్యాణ్ విజయంపై రామ్ చరణ్ రియాక్టయ్యాడు. ఈ విజయం తమ కుటుంబానికే గర్వకారణం ..మీది అద్భుతవిజయం పవన్ కళ్యాణ్ గారు అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు చెర్రీ...
AP Election Results 2024 LIVE Updates : ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం - రేవంత్ రెడ్డి
కూటమి ఘన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం , ససమ్యలు పరిష్కరించుకుని అభివృద్ధి పథం వైపు సాగుదామని కోరారు......
Andhra Pradesh Assembly Election Results 2024 LIVE: మీ నాయకత్వం స్ఫూర్తిదాయకం - చంద్రబాబు విజయంపై కమల్ హాసన్ ట్వీట్!
ఏపీలో చంద్రబాబు ఘనవిజయంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఇచ్చిన తీర్రు చరిత్రాత్మకం , మీ నాయకత్వం , దార్శినికత స్ఫూర్తిదాయకం అంటూ ట్వీట్ చేశారు...
AP Assembly Election Result 2024 LIVE: చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్..ఎవరికెంత ఆధిక్యం!
కుప్పంలో చంద్రబాబు గెలుపు - 47340 ఆధిక్యం
పులివెందుల జగన్మోహనరెడ్డి గెలుపు - 61,687 ఆధిక్యం
మంగళగిరిలో లోకేష్ గెలుపు - 90160 ఆధిక్యం
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు - 70,279 ఆధిక్యం