![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నది వీరే
Andhra Pradesh Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.
LIVE
![AP Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నది వీరే AP Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నది వీరే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/03/83c62d5b58dddb6f3d7f292f135b40131717418152474876_original.jpg)
Background
ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నది వీరే
AP Loksabha Election Results 2024: టీడీపీ ఎంపీ అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని 1.58 లక్షల ఓట్లు, అమలాపురం - హరీష్ (1.54 లక్షల ఓట్లు), విశాఖ -శ్రీభరత్ (1.69 లక్షల ఓట్లు), శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు (1.70 లక్షలు), ఒంగోలు - మాగుంట శ్రీనివాసులురెడ్డి (8,223 ఓట్ల ఆధిక్యం), హిందూపురం - పార్థసారథి (50 వేల ఓట్లు), అనంతపురం - లక్ష్మీనారాయణ (88 వేల ఓట్ల ఆధిక్యం), ఏలూరు - మహేష్ కుమార్ (86 వేల ఓట్లు), విజయనగరం - అప్పలనాయుడు (81 వేల ఓట్లు), నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు (80 వేల ఓట్లు), చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ (81 వేల ఓట్లు), నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (లక్ష ఓట్లు) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల లీడ్ లో పెమ్మసాని
AP Loksabha Election Results 2024: గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకూ 3,44,736 ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఈయన.. ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతున్నారు.
భారీ ఆధిక్యంలో రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి
AP Loksabha Election Results 2024: రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌పై 2 లక్షల ఆధిక్యంలో ఉన్నారు.
ఏపీలో కూటమి ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 16 స్థానాల్లో లీడింగ్
AP Loksabha Election Results 2024: ఏపీలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మొత్తం 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. వైసీపీ 3 స్థానాలు, జనసేన 2, బీజేపీ 4 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.
విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యం
AP Loksabha Election Results 2024: విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిపై 31,574 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)