News
News
X

AP Skill Development Scam : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ ఎంట్రీ, నలుగురు అరెస్టు

AP Skill Development Scam : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నలుగురిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

FOLLOW US: 
Share:

AP Skill Development Scam : ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కా్మ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నలుగురిని ఈడీ శుక్రవారం అరెస్ట్‌ చేసింది. విశాఖ స్పెషల్‌ కోర్టులో నలుగురినీ హాజరుపర్చిన ఈడీ... కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్‌ రిమాండ్‌ను తరలించింది. ఈ కేసులో సిమెన్స్‌ మాజీ ఎండీ శేఖర్‌ బోస్‌ సహా నలుగురు అరెస్ట్ అయ్యారు. డీజీ టెక్‌ ఎండీ వికాస్‌ వినాయక్‌, పీపీఎస్‌పీ ఐటీ స్కిల్స్‌ ప్రాజెక్ట్‌ సీవోవో ముకుల్‌చంద్ర అగర్వాల్‌, ఎస్‌ఎస్‌ఆర్‌ అసోసియేట్స్‌ సురేష్‌ గోయల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.  

స్పీడ్ పెంచిన సీఐడీ  

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసు విచారణలో భాగంగా సీమెన్స్ ఇండస్ట్రీయల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ ను ఏపీ సీఐడీ పోలీసులు యూపీలోని నోయిడాలో ఇటీవల అరెస్ట్ చేశారు. బుధవారం ఏపీ సీఐడీ నోయిడాలోని ఆయన నివాసానికి వెళ్లి భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. విజయవాడలోని కోర్టులో హాజరు పరిచేందుకుగానూ 36 గంటల సమయం ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. 

ప్రాజెక్ట్ అంచనాలు తారుమారు  

ఇతర నిందితులతో కలిసి సిమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా రూ. 3300 కోట్లకు పెంచి, ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేశారని భాస్కర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు వ్యవయంలో 10 శాతం చెల్లింపులలో భాగంగా అదనంగా రూ. 371 కోట్ల భారం ఏర్పడింది. కానీ సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ధర కేవలం రూ. 58 కోట్లు అని బిల్లులు చేసి ఉంది. జి.వి.ఎస్.భాస్కర్ ప్రాజెక్ట్ అంచనాలను తారుమారు చేసి రూ. 3300 కోట్లకు చేర్చాడని ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.

అవగాహన ఒప్పందం ప్రకారం తారుమారు

సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెక్నాలజీ అందిస్తున్న పార్ట్ నర్ ఈ ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం వాటాను అందించాలని భావించారు. కానీ భాస్కర్, మరికొందరు నిందితులు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో కలిసి, అవగాహన ఒప్పందాన్ని తారుమారు చేయడానికి కుట్ర చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకున్నా, ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు తేల్చారు. సిమెన్స్ + డిజైన్‌టెక్‌ షెల్ కంపెనీలకు రూ.371 కోట్ల పనులు అప్పగించినట్లు ఒప్పందం జరిగింది. అయితే టెక్ సపోర్ట్ అందించే కంపెనీలు ప్రాజెక్టులో 90 శాతం మేర వాటాను భరించాలని సైతం నిర్ణయించారు. అనంతరం ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 

Published at : 10 Mar 2023 06:00 PM (IST) Tags: ED Visakha News AP Skill development Crime news Scam Four arrested

సంబంధిత కథనాలు

RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ -  కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..

RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

ఏపీ ప్రెస్‌ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సు - అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం

Tirupati News: వరదయ్యపాలెం అంగన్వాడీ కేంద్రానికి తాళం - సీడీపీఓ వచ్చే వరకు తెరవనంటున్న టీచర్ 

Tirupati News: వరదయ్యపాలెం అంగన్వాడీ కేంద్రానికి తాళం - సీడీపీఓ వచ్చే వరకు తెరవనంటున్న టీచర్ 

టాప్ స్టోరీస్

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

LSG Vs DC: టాస్ గెలిచిన వార్నర్ భాయ్ - ఫీల్డింగ్‌కే ఓటు!

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

AP News  :  ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!

PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!