అన్వేషించండి

Vijayawada- Hyderabad Traffic Jam: సొంతూళ్ల నుంచి తిరుగుప్రయాణం, హైదరాబాద్- విజయవాడ హైవేపై కి.మీ మేర ట్రాఫిక్ జామ్

Hyderabad- Vijayawada Traffic Jam: దసరా పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణం కావడంతో వరుసగా రెండో రోజు హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది.

Hyderabad- Vijayawada National High Way | హైదరాబాద్‌: దసరా సెలవుల అనంతరం ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దాంతో వరుసగా రెండోరోజు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జర్నీ టైం కంటే, ట్రాఫిక్ లో వేచి చూసే సమయమే ఎక్కువ అవుతోంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వరకు భారీ రద్దీ ఏర్పడింది. సోమవారం ఉదయం సైతం  హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన రహదారులపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ జామ్ సమస్య తప్పడం లేదు.

చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు ట్రాఫిక్ జామ్

నల్గొండ జిల్లాలో చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు 4 కిలోమీటర్ల వేర వాహనాలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణ పనుల వల్లఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద, దండు మల్కాపురం, చౌటుప్పల్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చింతలకుంట నుంచి దిల్‌సుఖ్ నగర్ వెళ్లే మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ కిలోమీటర్ల మేర రోడ్లపై నిలిచిపోయాయి.

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం నుంచే ట్రాఫిక్‌ క్రమంగా పెరుగుతోంది. పండుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి తమ వ్యక్తిగత వాహనాలలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కావడంతో రోడ్లపై ఎటు చూసినా వాహనాల రద్దీ కనిపిస్తోంది. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ వైపున 9 టోల్ బూత్‌లను ప్రారంభించి వాహనాలను వేగంగా పంపుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. 

ప్రతి దసరా, సంక్రాంతికి ఇదే సమస్య

దసరా, సంక్రాంతి పండుగల సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ప్రతి ఏడాది ట్రాఫిక్ జామ్ కావడం తెలిసిందే. ఈ ఏడాది కూడా దసరా పండుగ చేసుకుని సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు కావడంతో టోల్ ప్లాజాల వద్ద, కొన్ని జంక్షన్న వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నిలిచిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే సమయంలో రోజుకు కొన్ని వాహనాల చొప్పున వెళ్తాయని, కానీ రెండు రోజుల వ్యవధిలో దాదాపుగా అందరూ తిరుగు ప్రయాణం కావడంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget