Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగింపు- ఘటనపై అధికారుల సందేహం
Andhra Pradesh: విజయవాడ వరద తగ్గినప్పటికీ ఇంకా ఆ ప్రభావం సమసిపోలేదు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వెలుగు చూస్తున్న అంశాలు అధికారులనే ఆశ్చర్యపరుస్తున్నాయి.
![Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగింపు- ఘటనపై అధికారుల సందేహం There are many doubts about the removal of the chains of the Prakasam barrage sluice gates Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగింపు- ఘటనపై అధికారుల సందేహం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/09/b672c78dbb0bf353956dcae0f77c8dc91725861109367215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vijayawada: ప్రకాశం బ్యారేజ్‌లో రోజు అంశం వెలుగులోకి వస్తోంది. మొన్నటి మొన్న ఓవైపు వరద విజయవాడను ముంచేస్తుంటే మరోవైపు మూడు బోట్లు ప్రకాశం బ్యారేజ్ వైపుగా దూసుకొచ్చి గేట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి(ప్రకాశం బ్యారేజ్‌ని పడవులు ఢీకొట్టిన వార్తను ఇక్కడ చదవొచ్చు). ఇందులో కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమాన పడుతోంది. పూర్తి స్థాయి విచారణకి కూడా ఆదేశించింది.
దీనికి సంబంధించిన నివేదికను చంద్రబాబుకు అధికారులు సమర్పించారు(ప్రకాశం బ్యారేజీ ధ్వంసంపై కేసు నమోదుకు సంబంధించిన వార్త ఇది). బ్యారేజ్‌ను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్దారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్(టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఈ మధ్య అరెస్టు అయ్యారు దీనికి సంబంధించిన వార్తను ఈ లింక్‌లో చూడొచ్చు) ఫాలోవర్స్‌కు ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీకి చెందినవిగా తేల్చారు.
ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మరో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్‌కు చెందిన పది గేట్లకు సంబంధించిన చైన్లు తొలిగించారనేది కలకలం రేపుతోంది. ఇది కావాలని చేశారా లేకుంటే ఇంకా ఏమైనా జరిగి ఉంటుందా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. అధికారులు
ప్రకాశం బ్యారేజ్‌కు చెందిన మొత్తం 10 గేట్లకు చెందిన చైన్లు తొలగించడాన్ని ఇప్పుడు గుర్తించారు అధికారులు. ఆవిషయం తెలిసిన తర్వాత ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. బ్యారేజ్‌కు ఒకవైపు 6, మరోవైపు నాలుగు స్లూయిజ్ గేట్లకు సంబంధించిన చైన్లు తొలగించారు. బ్యారేజ్ నీటిమట్టం తగ్గే టైంలో గేట్ల కింద ఉన్న వ్యర్థాలు పంపేందుకు వీటిని ఆపరేట్ చేయనున్నారు. ఇప్పుడు కూడా ఆ పని చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వ్యర్థాలు పంపేందుకు స్లూయిజ్ గేట్లు ఎత్తాలని భావించారు. పని చేయకోపవడం చూస్తే చైన్లు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. మొన్న పడవులతో వెయిట్లు ధ్వంసం కావడం,, ఇప్పుడు స్లూయిజ్ గేట్ల చైన్లు లేకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు వివిధ మార్గాల్లో కారణాలు కనుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు.
Also Read: ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు - ఇరిగేషన్ అధికారుల అనుమానాలు, కుట్ర కోణంపై పోలీసులకు ఫిర్యాదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)