అన్వేషించండి

Vijayawada News : విద్యార్థిని కాలితో తన్నిన లెక్చరర్, కాలేజీ ప్రిన్సిపల్ కు ఇంటర్ బోర్డు నోటీసులు

Vijayawada News : విద్యార్థిని లెక్చరర్ కాలితో తన్నిన ఘటనపై ఇంటర్ బోర్డు సీరియస్ అయింది. కాలేజీ ప్రిన్సిపల్ కు నోటీసులు జారీ చేసింది.

Vijayawada News : కార్పొరేట్ క‌ళాశాల‌ల ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. వేలాది రూపాయ‌లు ఫీజులు వ‌సూలు చేయ‌డ‌మే కాకుండా విద్యార్థుల ప‌ట్ల దురుసుగా ప్రవ‌ర్తిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. చ‌క్కటి విద్యా బుద్ధులు చెప్పాల్సిన గురువులే కాలితో విద్యార్థిని త‌న్నడం వివాదాస్పదంగా మారింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ క‌ళాశాల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న వైర‌ల్‌గా మారింది. ఈ లెక్చర‌ర్‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

అసలేం జరిగింది? 

విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థిని లెక్చరర్ తీవ్రంగా కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది. విద్యార్థిని చెంపలపై కొట్టిన లెక్చరర్ ఆగ్రహంతో కాలితో కూడా తన్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పెద్ద చర్చకు దారి తీసింది. క్లాస్‌ లో మాట్లాడాడని విద్యార్థిని లెక్చరర్ చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం వైరల్‌అయింది. ఈ ఘటన ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు వరకు చేరింది. దీంతో ఇంటర్‌ బోర్డ్‌ సీరియస్ అయింది. కాలేజీ నిర్వహకులకు ఏపీ ఇంటర్‌ బోర్డు జాయింట్‌ సెక్రటరీ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. 

కాలేజీకి షోకాజ్ నోటీసు 

ఈ ఘటనతో కాలేజి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఇంటర్ బోర్డు నోటీసులో తెలిపింది. ఈ విషయమై ఇంటర్ బోర్డు విద్యామండలి జాయింట్ సెక్రటరీ జీఎస్ఆర్ కృష్ణారావు మాట్లాడుతూ... విద్యార్థిని లెక్చరర్ తీవ్రంగా కొట్టిన వీడియోపై ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు అందిందన్నారు. లెక్చలర్ రవికుమార్, ప్రిన్సిపాల్ వద్ద ఈ ఘటనకు సంబంధించి వివరాలు తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సీఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐవో రవికుమార్, చైల్డ్ లైన్ అధికారులు విచారణ చేశారని తెలిపారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై ప్రైవేట్ కాలేజీకి షోకాజ్ నోటీస్ ఇచ్చామన్నారు. నిర్వాహకులు సరైన వివరణ ఇవ్వకపోతే గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పొక్సో చట్టం ప్రకారం  చర్యలు తీసుకుంటామని కృష్ణారావు వెల్లడించారు. ఏ కారణంతో చేసినా ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్, ఏపీ సీఎంవోను టాగ్ చేస్తూ వైరల్ వీడియో రీట్వీట్లు చేస్తున్నారు. 

Also Read : Prakasam News : ప్రాణం మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం, ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ

 Also Read : Crime News: తాగిన మైకంలో డెలివరీ బాయ్‌ను ఘోరంగా కొట్టిన యువకులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

ABP C Voter Opinion Poll Telangana | లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటే పార్టీ ఏది? | ABP DesamABP C Voter Opinion Poll Andhra pradesh | లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటే పార్టీ ఏది? | ABPNirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Devara Movie: 'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
'దేవర' కోసం పోటీ పడుతున్న మూడు అగ్ర నిర్మాణ సంస్థలు- చివరికి ఎవరి చేతికో!
YS Avinash Reddy : సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు  - అవినాష్ రెడ్డి కౌంటర్
సునీత చెప్పేవన్నీ అవాస్తవాలు - అవినాష్ రెడ్డి కౌంటర్
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Embed widget