News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Prakasam News : ప్రాణం మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం, ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ

Prakasam News : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రకాశం జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడి మర్మాంగాని బ్లేడుతో కోసింది.

FOLLOW US: 
Share:

Prakasam News : వివాహేతరం సంబంధాలు హత్యలకు దారితీసున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. జిల్లాలోని కొండపి మండలం మూగచింతల గ్రామంలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  మూగచింతలకు చెందిన సీహెచ్‌ హరినారాయణకు అదే గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి అతడు ఆమె దగ్గరు వెళ్లాడు. కాసేపు సన్నిహితంగా ఉన్న మహిళ ప్లాన్ ప్రకారం తన వద్ద ఉన్న బ్లేడుతో ప్రియుడి మర్మాంగాన్ని కోసింది. తీవ్రగాయమైన హరినారాయణ అరుస్తూ బయటకు పరుగులు తీశాడు. విషయాన్ని గమించిన స్థానికులు బాధితుడ్ని ఒంగోలులోని ఆసుపత్రికి తరలించారు. హరినారాయణకు భార్య లేకపోవడంతో చాలా కాలం నుంచి మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆస్తి కోసమో, మరేదైనా కారణం ఉందా అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

బ్లేడుతో దాడి 

 మూగచింతల గ్రామంలో 60 సంవత్సరాలున్న హరినారాయణ పదేల్లుగా మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య ఆర్థిక పరమైన అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర విషయాలల్లోనూ మనస్పర్థలు చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో తనను వేధిస్తున్నాడని భావించిన మహిళ అతనిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసింది. 

లాడ్జిలో ఘోరం 

వివాహేతర సంబంధాల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయనే సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుత కాలంలో అయితే మరీనూ. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని.. కన్నబిడ్డల నుంచి కట్టుకున్న వాళ్ల దాకా ఎవర్ని చంపడానికైనా ఆలోచించట్లేదు జనాలు. అయితే భార్యతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఓ వ్యక్తి... రెండేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఇద్దరూ కలిసి స్థానికంగా ఉండే ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. ఇష్టం వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేసేవాళ్లు. అతడు ఆమెకు డబ్బులు కూడా ఇచ్చేవాడు. అయితే తాజాగా వీరిద్దరూ లాడ్జికి వెళ్లి గడిపారు. అనంతరం ఆమె డబ్బులు అడిగింది. ఈ విషయంలోనే వీరిద్దరికీ గొడవ జరిగింది. దీంతో మహిళ ఇతడిని గట్టిగా నెట్టేసింది. దీంతో తలకు తీవ్ర గాయమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

అర్ధరాత్రి హత్య, ఉదయం పరార్..!

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఈశ్వర్ రెడ్డి (50) రెండేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమెతో వచ్చిన మనస్పర్థల కారణంగా గ్రామంలో ఉండలేక చిత్తూరుకు చేరుకున్నాడు. అక్కడే కూరగాయలు, తినుబండారాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇక్కడే అతడికి లలిత అనే మహిళ పరిచయం అయింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే బుధవారం రోజు వీరిద్దరూ సుందరయ్య వీధిలోని లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత డబ్బుల విషయమై వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఈశ్వర్ రెడ్డిని నెట్టేయడంతో తలకు తీవ్ర గాయమైంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గుర్తించిన లలిత తీవ్రంగా భయపడిపోయింది. ఏం చేయాలో తెలియాక గురువారం ఉదయమే.. హోటల్ రూంకు తాళం వేసి రిసెప్షన్ లో ఇచ్చి పరారైంది. 

Also Read : Crime News: తాగిన మైకంలో డెలివరీ బాయ్‌ను ఘోరంగా కొట్టిన యువకులు

Published at : 17 Sep 2022 06:01 PM (IST) Tags: AP Crime news Prakasam news Knife Attack Extramarital relationship

ఇవి కూడా చూడండి

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

టాప్ స్టోరీస్

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
×