Constables Fight: నడిరోడ్డుపైనే కొట్టుకున్న పోలీసులు - సత్యసాయి జిల్లాలో ఘటన, వీడియో వైరల్
Andhrapradesh News: ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపైనే ఘర్షణకు దిగిన ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Two Constables Beaten Up In Satyasai District: ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. సత్యసాయి జిల్లాలో (Satyasai District) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల (Rolla) మండలంలోని పిల్లిగుండ్లు చెక్ పోస్ట్ వద్ద నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఇద్దరు కానిస్టేబుళ్లు శివకుమార్, నారాయణస్వామి నాయక్ కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వీరు రొళ్ల, అగలి పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల దృష్ట్యా వాహన తనిఖీల్లో భాగంగా చెక్ పోస్ట్ వద్ద విధుల నిర్వహిస్తుండగా ఇద్దరికీ మాటా మాటా పెరిగి బాహాబాహీకి దిగారు. కాగా, విధుల నిర్వహణ విషయంలోనే ఇద్దరికీ వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడున్న వారు వీరి ఘర్షణను వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఎవరైనా గొడవపడితే సద్ది చెప్పాల్సిన పోలీసులే ఇలా గొడవ పడడం ఏంటనే స్థానికులు చర్చించుకున్నారు.