Kakinada Accident: కాకినాడ జిల్లాలో ప్రమాదం - డ్రైవర్ కు అస్వస్థతతో తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా
Tsrtc Bus Accident: కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్ డ్రైవర్ అస్వస్థతకు గురి కాగా బస్సుపై నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది.

Tsrtc Bus Overturned in Kakinada: కాకినాడ జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. టీఎస్ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి భద్రాచలం వెళ్తుండగా.. డ్రైవర్ కు బీపీ డౌన్ అయి బస్సుపై నియంత్రణ కోల్పోయారు. ఈ క్రమంలో కత్తిపూడి హైవేపై అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉండగా.. వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన స్థలంలో పక్కనే విద్యుత్ స్తంభం ఉండగా.. కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అన్నవరం ఎస్సై కిశోర్ ప్రమాద స్థలంలో పరిస్థితిని సమీక్షించారు.
Also Read: Konaseema Accident: కోనసీమ జిల్లాలో రియల్ హీరో - ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

