Konaseema Accident: కోనసీమ జిల్లాలో రియల్ హీరో - ఏడుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసలు
Konaseema News: ఓ కారు ప్రమాదానికి గురై కాల్వలోకి దూసుకెళ్లగా.. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ గమనించి అందులోని వారిని రక్షించారు. కోనసీమ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
Constable Saves Seven Lives in Konaseema District: అంబేడ్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఏడుగురి ప్రాణాలు కాపాడి రియల్ హీరోగా మారారు. రాజోలుకు చెందిన ఏడుగురు సోమవారం ఉదయం కారులో రాజమహేంద్రవరం (Rajamahendravaram) నుంచి సొంతూరికి వస్తుండగా.. పి.గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద కారు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టి, అనంతరం పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నెల్లి శ్రీనివాస్ వెంటనే స్పందించారు. కాల్వలో దిగి కారు డోర్లు తెరిచి, ఐదుగురు పెద్దవాళ్లు, ఇద్దరు చిన్నారులను కాపాడారు. కొద్ది సేపటికి స్థానికులు ఈ ప్రమాదాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్నారు. వారి సాయంతో కారులోని వస్తువులను బయటకు తీశారు. బాధితులు స్వల్పంగా గాయపడగా.. వారిని అంబులెన్సులో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, సాహసంతో ఏడుగురి ప్రాణాలు రక్షించిన కానిస్టేబుల్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read: Nellore News: 25 కత్తిపోట్లు - భార్య కళ్లెదుటే భర్త దారుణ హత్య, ఎక్కడంటే?