Top Headlines: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు - సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత తాము తీసుకుంటామని కానీ విధ్వంసం చేసిన ఎస్కో బార్‌లు మాత్రం మరోసారి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులపై ఉండే గుంతలు పూడ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా చింతలగొర్లివాని పాలెంలో ప్రారంభించారు. వాస్తవంగా ఈ కార్యక్రమం విజయనగరం జిల్లాలో జరగాల్సి ఉంది. కానీ అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇంకా చదవండి.
2. తిరుపతిలో చిన్నారిపై అఘాయిత్యం
చాక్లెట్లు ఇస్తానని చెప్పి చిన్నారి తీసుకెళ్లి అత్యాచారం చేసిన దుర్ఘటన తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎంపురంలో జరిగింది. ఈ విషయంలో తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సుశాంత్ అనే అబ్బాయి తిరుపతి జిల్లాలో వడమాలపేట మండలం ఏఎంపురంలో చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు. తర్వాత ఏం తెలియనట్టు సైలెంట్‌గా ఇంటికి వచ్చేశాడు. ఆడిస్తానని చెప్పి చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు. ఇంకా చదవండి.
3. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రిప్లై
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని పార్టీని నమ్మవద్దని మహారాష్ట్ర, జార్ఖండ్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రచార సభల్లో ప్రధాని మోదీ ఆరోపిస్తున్నారు. ఇలా తెలంగాణ విషయంలో మోదీ చేస్తున్న ఆరోపణలకు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. మా ప్రభుత్వం గురించి మోడీ చేసిన ప్రకటనలో అనేక అపోహలు, అవాస్తవాలు ఉన్నాయని ట్విట్టర్‌లో తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ దుష్పరిపాలన పోయిందని ప్రజల ఆనందం, ఆశలు వెల్లువెత్తాయన్నారు. ఇంకా చదవండి.
4. తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు
పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇన్నిరోజుల వరకు వాతావరణం క్లియర్‌గా ఉండటంతో బాగానే ఉన్నా.. గత రెండు రోజుల నుంచి మార్పు కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా నుంచి కాలుష్యానికి పొగమంచు తోడై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని కోదాడ సమీపంలో విజయవాడ వెళ్తున్న బస్ ప్రమాదానికి గురైంది. రహదారి 65పై ఆగి ఉన్న ట్రావెల్స్ బస్‌ను ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనోల 30 మందికిపైగా గాయాలు అయ్యాయి. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా చదవండి.
5. కార్తీక మాసం - ఆలయాల సందర్శనకు ప్రత్యేక ట్రైన్
కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలను సందర్శించుకోవాలని చాలా మంది భక్తులు ప్లాన్ చేసుకొని ఉంటారు. అలాంటి వారందరికీ ఐఆర్‌టీసీ ప్రత్యేక ఆఫర్ ఇస్తోంది. దక్షిణ భారత దేశంలో వివిధ పుణ్య క్షేత్రాల దర్శన భాగ్యం కలిగించేందుకు ప్రత్యేక ప్యాకేజీతో సిద్ధమైంది. దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ ప్రత్యేక ప్యాకేజీ నవంబర్ ఆరు నుంచి ప్రారంభం కానుంది. ఇంకా చదవండి.