Tirupati News: తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
Tirupati Crime News: తిరుపతిలో చిన్నారి హత్యపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి బాధితులకు న్యాయంచేయాలన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల సాయం ప్రకటించారు.
Tirupati Crime News: చాక్లెట్లు ఇస్తానని చెప్పి చిన్నారి తీసుకెళ్లి అత్యాచారం చేసిన దుర్ఘటన తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎంపురంలో జరిగింది. ఈ విషయంలో తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం సుశాంత్ అనే అబ్బాయి తిరుపతి జిల్లాలో వడమాలపేట మండలం ఏఎంపురంలో చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు. తర్వాత ఏం తెలియనట్టు సైలెంట్‌గా ఇంటికి వచ్చేశాడు. ఆడిస్తానని చెప్పి చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఇద్దరూ ఆడుకుంటున్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. బయటకు వెళ్లి వచ్చేసరికి పాప కనిపించడం లేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. తాము ఇంటి నుంచి వెళ్లే సరికి సుశాంత్ ఉన్నాడని కన్నవాళ్లు చెప్పారు.
సుశాంత్ పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పాడు. పాప మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం జరిపించారు. బాలుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పది లక్షల సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వెంటనే కన్నవారి వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలని సత్వర న్యాయం చేయాలని చెప్పారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి అనితను కూడా చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు హోంమంత్రి అని ఆదివారం తిరుపతి వెళ్లనున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమె చేతుల మీదుగానే పది లక్షల రూపాయల చెక్‌ను అందజేయనున్నారు. చాకెట్ల ఆశచూపించి చిన్నారిని చంపేశారని తెలిసి చాలా బాధ కలిగిందన్నారు అనిత.
Also Read: కడియపులంకలో వీడిన మహిళ మర్డర్ మిస్టరీ- అత్యాచారం చేసిన చంపేసిన నిందితుల అరెస్టు