Karthika Masam Special Train: కార్తీక మాసంలో ఆలయాల సందర్శనకు ఐఆర్‌టీసీ ప్రత్యేక ట్రైన్- దివ్య దక్షిణ్ యాత్ర పేరిట 9 రోజుల టూర్
IRCTC Special Train :కార్తీక మాసం చాలా ప్రత్యేకమైన నెల. ఎంతో నిష్టతో పూజలు చేసే భక్తులు. ప్రముఖ పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్‌టీసీ ప్రత్యేక ట్రైన్ నడుపుతోంది.
Karthika Masam 2024 కార్తీక మాసం మొదలైంది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రాలను సందర్శించుకోవాలని చాలా మంది భక్తులు ప్లాన్ చేసుకొని ఉంటారు. అలాంటి వారందరికీ ఐఆర్‌టీసీ ప్రత్యేక ఆఫర్ ఇస్తోంది. దక్షిణ భారత దేశంలో వివిధ పుణ్య క్షేత్రాల దర్శన భాగ్యం కలిగించేందుకు ప్రత్యేక ప్యాకేజీతో సిద్ధమైంది.
దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ ప్రత్యేక ప్యాకేజీ నవంబర్ ఆరు నుంచి ప్రారంభంకానుంది. 9 రోజులు ఉంటే ఈ టూర్ ప్యాకేజీలో తిరువణ్ణమలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివెండ్రం, తిరుచ్చీ, తంజావూరుతోపాటు దక్షిణ భారత దేశంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లో 2AC, 3AC & SL classesలో టికెట్లు కేటాయిస్తారు. మొత్తం 578 మంది ఈ టూర్ ప్యాకేజీలో సందర్శనకు వెళ్లొచ్చు. ఇది తొమ్మిది రోజుల టూర్. నవంబర్ 6న ప్రారంభమవుతుంది. 578 సీట్లలో SL క్లాస్ 320, 3AC క్లాస్ 206, 2AC క్లాస్ 50 సీట్లు ఉంటాయి.
ఎక్కడెక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు
సికింద్రాబాద్‌లో బయల్దేరే ఈ ట్రైన్ భువనగిరి, కాజీపేట, జనగామ్, వరంగల్ మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతుంది. ఆయా స్టేషన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లంతా ఎక్కి టూర్‌కు వెళ్లవచ్చు.
టూర్ ప్యాకేజీ ఒక్కసారి పరిశీలిస్తే...
కేటగిరి | పెద్దలకు | చిన్నారులకు(5 నుంచి 11 ఏళ్లు ) |
SL క్లాస్‌లో ప్రయాణం | రూ. 14, 250 | రూ. 13, 250 |
3AC క్లాస్‌లో ప్రయాణం | రూ. 21,900 | రూ. 20,700 |
2ACక్లాస్‌లో ప్రయాణం | రూ. 28,450 | రూ. 27,010 |
ఎక్కడ ఏం చూడవచ్చు
- తిరువణ్‌మలై: అరుణాచలం ఆలయం
- రామేశ్వరం : రామేశ్వరం టెంపుల్
- మదురై : మీనాక్షి అమ్మవారి ఆలయం
- కన్యాకుమారీ: రాక్ మెమోరియల్, కుమారి అమ్మణ్ టెంపుల్
- త్రివేండ్రం: శ్రీ పద్మనాభ స్వామి ఆలయం
- తిరుచ్చి : శ్రీ రంగనాథ స్వామి ఆలయం
- తంజావూరు: బృహదీశ్వర ఆలయం
ఏ రోజు ఎక్కడ ఉంటాం
- మొదటి రోజు (నవంబర్ 6) సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరతారు.
- రెండో రోజు (నవంబర్ 7) ఉదయం ఏడు గంటలకు తిరువణ్‌మలైలో దిగుతారు. అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత ఆలయాన్ని సందర్శిస్తారు. మళ్లీ అక్కడ నుంచి రాత్రి పది గంటలకు రామేశ్వరం బయల్దేరతారు.
- మూడో రోజు (నవంబర్ 8) కుదల్‌నగర్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరం బయల్దేరి వెళ్తారు. అక్కడ వెళ్లి స్వామిని దర్శించుకొని అక్కడే స్టే చేసి లోకల్‌గా ఉండే ఆలయాలు సందర్శిస్తారు.
- నాల్గో రోజు (నవంబర్ 9) ఉదయాన్నే ఫ్రెష్ అయిన తర్వాత మరికొన్ని ప్రాంతాలు సందర్శిస్తారు. అక్కడ లంచ్ చేసిన మధ్యాహ్నం రోడ్డు మార్గంలోనే మదురై బయల్దేరతారు. అక్కడకు చేరుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకొని లోకల్‌గా షాపింగ్‌లు చేసి మళ్లీ కుదల్‌నగర్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కన్యూకుమారి బయల్దేరతారు.
- ఐదో రోజు (నవంబర్ 10) ఉదయాన్నే 8 గంటలకు కన్యాకుమారి చేరుకుంటారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. సూర్యాస్తమయం, గాంధీ మండపం, రాక్ గార్డెన్ అన్నీ సందర్శిస్తారు.
- ఆరో రోజు (నవంబర్ 11) కన్యూకుమారి నుంచి కోచువేళి మీదుగా తిరుచ్చీ చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు బయల్దేరి తిరుచ్చీ వెళ్లి అక్కడ పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకొని కోవళం బీచ్ చూసిన తర్వాత మళ్లీ తిరుచిరపల్లి బయల్దేరతారు. మార్గ మధ్యలోనే ట్రైన్‌లోనే డిన్నర్ చేస్తారు.
- ఏడో రోజు (నవంబర్ 12) ఉదయాన్నే తిరుచిరపల్లి చేరుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు వెళ్తి బృహదీశ్వర ఆలయం చూస్తారు. అనంతరం సికింద్రాబాద్ తిరుగుపయనం అవుతారు. మార్గ మధ్యలోనే డిన్నర్ చేస్తారు.
- నవంబర్ 12 రాత్రి 11 గంటలకు బయల్దేరిన తర్వాత 14 తేదీ వేకువజామున 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతోటూర్ ముగుస్తుంది.
మీరు డబ్బులు చెల్లించుకోవాల్సిన అంశాలు
- ఆలయాల ప్రవేస ఫీజు, బోటింగ్, ఇతర పర్యాటక ప్రదేశాల ప్రవేశ రుసుం చెల్లించాలి.
- వాళ్లు ఇచ్చిన ఫుడ్ తినాల్సి ఉంటుంది. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మాత్రం డబ్బులు చెల్లించాలి.
- రూమ్‌లో ఉండేటప్పుడు ఏమైనా తెప్పించుకుంటే కూడా మీరే చెల్లించుకోవాలి.
- లోకల్ గైడ్ మాట్లాడుకుంటే కూడా డబ్బులు మీరే భరించాలి.
- డ్రైవర్స్‌కు ఇచ్చే టిప్స్, వెయిటర్స్‌కు ఇచ్చే టిప్స్, ఫ్యూయల్‌కు చెల్లించే సర్ ఛార్జ్ కూడా భరించాలి.
- వైన్, మినరల్ వాటర్, ఇష్టమైన ఫుడ్, డింక్స్‌కు మీరే చెల్లించుకోవాలి.