Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు
AP CM `Chandra Babu News:ఏపీని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత తాము తీసుకుంటామని కానీ ఎస్కోబార్ రాకుండా చూసుకోవాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు.
AP CM Chandra Babu Anakapalli Tour: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే బాధ్యత తాము తీసుకుంటామని కానీ విధ్వంసం చేసిన ఎస్కో బార్‌లు మాత్రం మరోసారి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులపై ఉండే గుంతలు పూడ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా చింతలగొర్లివాని పాలెంలో ప్రారంభించారు. వాస్తవంగా ఈ కార్యక్రమం విజయనగరం జిల్లాలో జరగాల్సి ఉంది. కానీ అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. రాత్రికి రాత్రే కార్యక్రమాన్ని ఫిక్స్ చేసినప్పటికి ప్రజలు, అధికారులు, పార్టీ నేతలు సమన్వయంతో చాలా బాగా పని చేసి విజయవంతం చేశారని ముఖ్యమంత్రి అభినందించారు.
చింతలగొర్లివానిపాలెంలో చేపట్టిన గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో గుంతలు లేని రహదార్లు చూస్తామన్నారు చంద్రబాబు. పనులు చేపట్టడమంటే ఏదో మట్టి వేసి వెళ్లిపోవడం లేదని పకడ్బంధీగా అన్ని పరికరాలతో వచ్చి పనులు చేపడుతున్నామన్నారు సీఎం. ఐదేళ్ల పాటు జగన్ మోహన్ రెడ్డి గుంతలు పెట్టారని వాటిని పూడ్చే కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామన్నారు.
రోడ్లపైనే కాకుండా రాష్ట్రానికి పెద్ద పెద్ద గోతులు తవ్విన వ్యక్తి అని జగన్‌పై ధ్వజమెత్తారు చంద్రబాబు. ప్రమాదకరమైన గోతులు ఉన్నాయన్నారు. రోడ్లపై కనిపించే చిన్న చిన్న గుంతలే పెను ప్రమాదానికి కారణమవుతాయన్నారు. రాష్ట్రంలో రోడ్లు నరకానికి రాదార్లుగా మారాయన్నారు. వేరే రాష్ట్రాల వాళ్లు కూడా అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. ఐదేళ్లలో రోడ్ల కోసం కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. నాగరికతకు చిహ్నంగా ఉండే రహదారులకు ఐదేళ్లు చేసిందేమీ లేదు. చాలా ప్రాంతాల్లో రోడ్లపైనే డెలవరీలు అయిన ఘటనలు చూశామన్నారు.
అభివృద్ధిని తీసుకొచ్చే రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలన్నారు. రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయని.. దాని వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని దీంతో వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ప్రమాదాలు తగ్గుతాయన్నారు. వాహనాలు రిపేర్ల ఖర్చు తగ్గుతందన్నారు. ఆరోగ్యం కూడా బాగుటుందన్నారు. ప్రగతి సాధించిన దేశాల్లో రోడ్లపై ప్రత్యేక దృష్టి పెడతారన్నారు.
పాతికేళ్ల క్రితం జాతీయ రహదార్లపై మట్టి కూడా వేసే పరిస్థితి లేకుండా ఉండేదన్నారు. తాను ఓసారి మలేషియా వెళ్తే అక్కడ రోడ్లు చూసి ఆశ్చర్యపోయాను. అదే విధానం ఇక్కడకు తీసుకొచ్చాం. జాతీయ రహదార్లు రిపేర్లు చేశాం. మనోళ్లు కూడా అర్థం చేసుకున్నారు. టోల్ ఫీ భారం అనుకోకుండా కట్టారు. ఇలాంటి రోడ్డుల నెల్లూరు టు చెన్నైకు మొదటి రోడ్డు పడింది. ఆ తర్వాత దేశమంతా పెద్ద ఎత్తున రోడ్లు వేశారు. రోడ్లు బాగుపడటంతో ఆదాయం పెరిగింది. అభివృద్ధి కనిపిస్తోందన్నారు చంద్రబాబు. రోడ్లు బాగుంటే ఆప్రాంతంలో వ్యాపారులు, రైతులకు బాగుపడతారన్నారు.
ఇప్పుడు ప్రారంభించిన గుంతలు పూడ్చే కార్యక్రమం సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదార్లు అందివ్వాలని నిర్ణయించారు. ఆంధ్రో ఎస్కోబార్ పెట్టిన గుంతలు పూడ్చలేక కష్టపడాల్సి వస్తోందన్నారు. అలాంటి ఎస్కోబార్‌లు రాష్ట్రానికి వద్దన్నారు. అభివృద్ధి రాజకీయాలు మాత్రమే కావాలన్నారు. 2014-19 మధ్య రోడ్లు ఎలా ఉన్నాయి నేటి రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలు గుర్తించారు. పవన్ కల్యాణ్ సంకల్పం తీసుకున్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్లలో సిమెంట్ రోడ్లు లేని వీధి కనిపించదన్నారు. మంచి రోడ్లు, మంచి ప్రభుత్వం అందించే బాధ్యత తాము తీసుకుంటామని సైకోలు రాష్ట్రంలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్య ప్రజలపై ఉందన్నారు.
రాత్రికి రాత్రే కార్యక్రమం నిర్వహించినా గతంలో చూసినట్టు ఎవర్నీ బలవంతంగా తరలించలేదని... అరెస్టులు లేవని గుర్తు చేశారు. పరదాలు కూడా కనిపించడం లేదన్నారు. అందరూ నవ్వుతూ సభకు వచ్చారని గతంలో ఇలాంటివి ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. అందుకే మంచి రోజులు వచ్చాయని, మంచిరోడ్లు వస్తాయన్నారు చంద్రబాబు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన గత పాలకుడు... వెయ్యి అరవై కోట్ల రూపాయలు ఆర్‌అండ్‌బీ కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారన్నారు. మిగతా కాంట్రాక్టర్లకు ఒక లక్ష కోట్లు అప్పులు పెట్టారుయ 10 లక్షలకుపైగా రాష్ట్రంలోపై అప్పులు మోపారు. తాను అప్పుల కోసం వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఎవరిని అప్పుడు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఎమ్మార్వో ఆఫీస్‌లు, మద్యం నుంచి వచ్చే ఆదాయన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని గుర్తు చేశారు.
ఇన్నింటిని దాటుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్నారు. వ్యక్తిగత ఆదాయం పెరిగినప్పుడే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని... వాటి నుంచి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. దీని కోసం మౌలిక సదుపాయాలు అవసరం అన్నారు. అందకే రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చేందుకు 860 కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు.