News
News
వీడియోలు ఆటలు
X

Top 5 Headlines Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ ఇవీ..

Top 5 Headlines Today: ఏపీ, తెలంగాణలో నేటి ఉదయం నుంచి పాలిటికల్, ముఖ్యమైన అప్ డేట్స్ మీకోసం..

FOLLOW US: 
Share:

 తమ్మినేని సీతారాంపై నకిలీ డిగ్రీ ఆరోపణలు - డాక్యుమెంట్స్ రిలీజ్ చేసిన టీడీపీ !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారం డిగ్రీ చదివినట్లు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి పునరుద్ఘాటించారు. తాము సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాల మేరకు ఆయన బీకాం చదివినట్లు అందజేసిన సర్టిఫికెట్లు బోగస్‌ అని తేలిందని నర్సిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఈ మేరకు హైదరాబాద్‌లో డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు.  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రికార్డుల్లో తన పేరు లేకుండానే సర్టిఫికెట్లు ఎలా వచ్చాయో స్పీకర్‌ తమ్మినేని చెప్పాలని నర్సిరెడ్డి హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు.  తమ్మినేని సీతారాం చదివినట్లు ప్రకటించుకున్న నాగర్‌కర్నూలు స్టడీ సెంటర్‌ రిజిస్టర్‌లో   వివరాలు లేవు. ఆయన పేర్కొన్న హాల్‌టిక్కెట్టు కూడా వేరొకరి పేరుతో ఉంది. అలాంటప్పుడు ఆయన వద్ద ఉన్న సర్టిఫికెట్లు ఎవరు తయారు చేశారు? దీనిపై శాఖాపరంగా అధికారులు విచారణ జరపాలన్నారు.  నకిలీ బాగోతంపై పోలీసులు దర్యాప్తు చేయాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.  నాగకర్నూలు స్టడీ సెంటర్‌లో 2015 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థుల వివరాలివ్వాలని అంబేడ్కర్‌ యూనివర్శిటీ అధికారులను సమాచార హక్కు చట్టం కింద కోరాం. ఆ ఏడాది ఆ స్టడీ సెంటర్‌లో మొత్తం 839 విద్యార్ధులు చదివారని పేర్కొంటూ ఆ విద్యార్ధులు అందరి వివరాలను అంబేద్కర్‌ యూనివర్సిటీ మాకు అధికారికంగా ఇచ్చింది. ఆ విద్యార్ధుల జాబితాలో తమ్మినేని సీతారాం పేరు లేదన్నారు. ఇంకా చదవండి

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు- విచారణ జూన్ 5కు వాయిదా

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తుపై కొంతవరకే సంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా వేగంగా దర్యాప్తు జరగాలని అభిప్రాయపడింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. జూన్ ఐదు నాటికి తదుపరి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేస్‌ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వేసిన పిటిషన్‌లపై హైకోర్టు విచారించింది. ఇప్పటికే ఈ కేసులో సిట్‌కు నోటీసులు జారీ చేసింది. కేసు పురోగతి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సిట్ సమర్పించిన నివేదికపై కోర్టు మిక్స్‌డ్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. పూర్తి స్థాయి రిపోర్టును జూన్ ఐదు లోపు కోర్టుకు సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. కేసును జూన్‌ ఐదుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇంకా చదవండి 

శ్వేత మృతి కేసులో మరో ట్విస్ట్- అడపడుచు భర్తపై తీవ్ర ఆరోపణలు
 విశాఖ మహిళ శ్వేత మృతి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు తాజాగా శ్వేత తల్లి చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ఆ ఆరోపణలతోనే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. 
వరుసకు అన్న అయ్యే ఆడపడుచు భర్త తనపై కన్నేశాడని శ్వేత తరచూ చెప్పేది అంటున్నారు ఆమె తల్లి. లైంగికంగా వేధించేవాడని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై చాలా సార్లు ఇంట్లో గొడవలు జరిగాయన్నారు. అత్తింటి వాళ్లు ఎవరూ శ్వేతకు మద్దతుగా నిలవలేదని... దీంతో వేధింపులు మరింత రెట్టింపు అయినట్టు చెబుతున్నారు. ఇదే యాంగిల్‌లో విచారణ చేసిన పోలీసులకు మరికొన్ని విషయాలు తెలిసినట్టు సమాచారం. ఇప్పటికే శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు... ఇది అనుమానాస్పద మృతిగానే కేసు రిజిస్టర్ చేసి విచారిస్తున్నారు. కేజీహెచ్‌లో ముగ్గురు వైద్యుల బృందంతో ఈ పోస్టుమార్టం నిర్వహించారు. ఆడపడుచు భర్త లైంగిక వేధింపుల విషయంలో కొన్ని ప్రాథమిక నివేదిక లభించినట్టు తెలుస్తోంది. ఇంకా చదవండి

కేసీఆర్‌పై విపక్షాల వార్‌- లీడర్లు లంచాలు తీసుకుంటే చర్యలేవి అంటూ ఫైర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ప్రతిపక్షాలు చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి. వాళ్లంతా లంచాలు తీసుకుంటున్నట్టు సీఎం దగ్గర సాక్ష్యాలు ఉంటే చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి తోకలు కత్తిరిస్తానంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు కథనాలు వస్తున్నాయి. ప్రింట్ మీడియాలో కూడా ఇదే స్టోరీలు రావడంతో వాటిని ట్యాగ్ చేస్తూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.  కేసీఆర్‌ సర్కార్ 30 శాతం కమిషన్ సర్‌కార్‌ అంటూ వంగ్యంగా ట్వీట్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ మీడియాలో వచ్చిన కథనాలను ట్యాగ్ చేశారు. ఇంకా చదవండి

నేడు విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుక - హాజరుకానున్న సూపర్ స్టార్ రజినీకాంత్

ఎన్టీఆర్(NTR) శత జయంతి కార్యక్రమాలు నేడు విజయవాడ(Vijayawada) సమీపంలోని తాడిగడపలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajini Kanth) హజరు కానున్నారు. దీంతో భారీగా ఏర్పాట్లు చేశారు.మహనీయుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఇవాళ జరగనున్నాయి. ఎన్టీఆర్‌ శత జయంతి సభ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ నేతృత్వంలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు..పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు జరుగనుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హజరు కానున్నారు. ఇంకా చదవండి 

Published at : 28 Apr 2023 03:12 PM (IST) Tags: AP Latest news Telugu News Today Tammineni KCR Telangana LAtest News NTR

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

AP Flexi War :  ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు -  వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

టాప్ స్టోరీస్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!