అన్వేషించండి

30 Day Leave For Government Staff: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ - వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడానికి 30 రోజుల సెలవులు

Elderly Parents Care: వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడానికి 30 రోజుల సెలవులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్‌లో తెలిపింది.

Government Staff Can Take 30 Day Leave To Care For Elderly Parents:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది తీపి కబరే.  సర్వీస్ రూల్స్ ప్రకారం  వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకు ఉద్యోగులకు  30 రోజుల సెలవులను అనుమతిస్తామని  కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం సహా ఏదైనా వ్యక్తిగత కారణాలకు ఈ సెలవు పొందవచ్చన్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడానికి సెలవు తీసుకోవడానికి ఏదైనా నిబంధన ఉందా అన్న ప్రశ్నను ఓ ఎంపీ అడిగారు. ఆ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 

"సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు) నియమాలు, 1972 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇతర అర్హత గల సెలవులతో పాటు 30 రోజుల ఆర్జిత సెలవు, 20 రోజుల హాఫ్ జీతం సెలవు, ఎనిమిది రోజుల క్యాజువల్ సెలవు, సంవత్సరానికి రెండు రోజుల పరిమిత సెలవులను అందిస్తుంది, వీటిని వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం వంటి ఏవైనా వ్యక్తిగత కారణాల వల్ల పొందవచ్చు" అని సింగ్  లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు) నియమాలు, 1972  ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సంవత్సరంలో కింది సెలవులు అందుబాటులో ఉన్నాయి:

30 రోజుల ఆర్జిత సెలవు : ఈ సెలవు పూర్తి జీతంతో అందుబాటులో ఉంటుంది.
20 రోజుల హాఫ్ పే సెలవు : ఈ సెలవు తీసుకుంటే సగం జీతం వస్తుంది.
8 రోజుల క్యాజువల్ సెలవు  : సాధారణ వ్యక్తిగత అవసరాల కోసం ఈ సెలవు  తీసుకోవచ్చు. 
2 రోజుల పరిమిత సెలవు : ఉద్యోగి ఎంచుకున్న పండుగలు లేదా ఇతర కారణాల కోసం ఈ సెలవు తీసుకోవచ్చు. 
 
ఈ సెలవు నియమాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి సౌలభ్యం కల్పిస్తాయి. ముఖ్యంగా, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు.  ఈ నియమాలు ఉద్యోగులకు వారి వ్యక్తిగత ,  కుటుంబ అవసరాలను నెరవేర్చేందుకు సహాయపడతాయని జితేంద్ర సింగ్ తెలిపారు.  ఈ సెలవులను తీసుకునేందుకు ఉద్యోగులు తమ సంబంధిత పై అధికారుల నుండి ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది.   జితేంద్ర సింగ్ సమాధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం  ఇస్తున్న ప్రాధాన్యతను చూపిస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget