Eng vs Ind Fourth Test First Innings Highlights | మొదటి ఇన్నింగ్స్ లో 358పరుగులకు భారత్ ఆలౌట్ | ABP Desam
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయ్యింది. 4 వికెట్ల నష్టానికి 264పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ధాటికి 358పరుగులకు ఆలౌట్ అయ్యింది. శార్దూల్ ఠాకూర్ 41పరుగులతో రాణించగా...జడేజా 20 పరుగులకు ఔట్ అవటంతో సుందర్ కి తోడుగా పోరాట యోధుడు రిషభ్ పంత్ మళ్లీ బరిలోకి దిగాడు. నిన్న 36పరుగులకే కాలికి గాయం కావటంతో వెనుదిరిగిన పంత్ ఈరోజు కుంటు కుంటూ హాఫ్ సెంచరీ బాదేశాడు 54పరుగులు చేసిన పంత్ ఆర్చర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అవ్వటంతో భారత్ పోరాటం ముగించక తప్పలేదు. తొలి 8మంది బ్యాటర్లలో ఒక్కళ్లు కూడా సింగిల్ డిజిట్ కి అవ్వకపోవటంతో భారత్ 358పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించనట్లైంది. ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే సాయి సుదర్శన్ 61, జైశ్వాల్ 58పరుగులు, పంత్ 54పరుగులు చేస్తే హాప్ సెంచరీలు పూర్తి చేస్తే...శార్దూల్ 41పరుగులు, రాహుల్ 46పరుగులు చేసి హాఫ్ సెంచరీలను తృటిలో మిస్సయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 8ఏళ్లలో తొలిసారి ఐదు వికెట్లు తీస్తే...ఆర్చర్ 3 వికెట్లు, క్రిస్ వోక్స్-లియాం డాసన్ చెరో వికెట్ తీశారు. బౌలింగ్ కు సహకరిస్తున్న పిచ్ పై రెండోరోజు రెండు సెషన్ల పాటు భారత్ ఎలా బౌలింగ్ చేస్తుందనే దానిపై నాలుగో టెస్టు గమనం ఆధారపడనుంది.





















