Hari Hara Veera Mallu Movie Review | Pawan Kalyan Best ఇచ్చారు కానీ..సినిమానే | ABP Desam
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలైన మొదటి సినిమా. ఇన్నాళ్లూ రీమేక్ సినిమాలే చేస్తున్నారు స్ట్రైట్ సినిమాలు చేయరా అంటూ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ లో వచ్చిన సినిమా హరి హర వీరమల్లు. మరి అటు అభిమానుల కోరికను తీర్చేలా...ఇటు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ను రుచి చూపించేలా హరిహర వీరమల్లు ఉందా ఈ రివ్యూలో చూద్దాం.
హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ అనుకున్న పాయింట్...ఏవో పర్సనల్ రీజన్స్...క్రియేటివ్ డిఫరెన్సెన్ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ప్రొడ్యూసర్ ఏఎం రత్నం వాళ్లబ్బాయి జ్యోతికృష్ణ డైరెక్టర్ గా వచ్చారు. ఈ సినిమాలో ఎవరెవరు ఏ పోర్షన్ కి డైరెక్ట్ చేశారు అని సినిమా చూస్తుంటేనే అర్థమైపోతుంది.
ఓ క్రేజీ ప్లాట్ తో స్టార్ట్ అవుతుంది సినిమా. కృష్ణానది తీరంలో కొల్లూరు గనుల్లో దొరికిన కోహినూర్ వజ్రం...అది దొరికిన బలహీనుల చేతుల్లో నుంచి బలవంతుల చేతుల్లోకి...అక్కడ నుంచి దొరల వద్దకు..అక్కడ నుంచి గోల్కొండ నవాబులు..అల్టిమేట్ గా మొఘల్ రాజ్య పాలకుడు అలంగీర్ అదే ఔరంగజేబు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆ వజ్రాన్ని హరిహర వీరమల్లు అనే దొంగ గోల్కొండ రాజ్యానికి తీసుకువచ్చేందుకు బయల్దేరటం...ఔరంగజేబు కు ఎదురు పడటం వరకూ ఓవరాల్ గా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్టోరీ ప్లాట్. దీనికి Sword vs Spirit అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. అసలు ఈ వీరమల్లు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు...కోహినూర్ వజ్రం కొట్టేయటానికి ఎందుకు గోల్కొండ నవాబు వీరమల్లునే ఎంచుకున్నాడు...వీరమల్లు వజ్రం కొట్టేయటానికి ఎందుకు ఒప్పుకున్నారు ఇలాంటివన్నీ పార్ట్ 1 లో ఉండే ఎపిసోడ్స్. వీటి మధ్యలోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మాట్లాడే సనాతన ధర్మం టాపిక్ ను తీసుకువచ్చి లేయర్లు లేయర్లుగా సినిమా మొత్తం అల్లారు.
సినిమా ఎలా ఉంది అనే విషయం మాట్లాడుకుంటే ఫస్టాఫ్ ను చాలా గ్రాండియర్ గా స్టార్ట్ చేస్తారు. వీరమల్లు పుట్టుక నుంచి మొదలుపెట్టి అతను దొంగ గా ఇచ్చే ఇంట్రడక్షన్ సీన్స్..ఆ మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాస్ జాతర ఉంటుంది. ఫ్యాన్స్ పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఆ 45 నిమిషాలు సినిమా. కానీ అక్కడి నుంచి మొదలువుతుంది. చాలా డీవియేషన్స్ తీసుకుంటుంది కథ. మధ్యలో హీరోయిన్ ట్రాక్...అనవసరమైన కామెడీ వచ్చి కథను డైల్యూట్ చేయటం మొదలుపెడుతుంది. బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ కి ఓ ఛార్మినార్ ఫైట్ ఉంటుంది. సీజీ వర్క్ దారుణంగా ఉన్న విషయాన్ని పక్కనపెడితే కథ పరంగా మంచి బ్యాంగ్ ఇచ్చి వదిలిపెడతాడు. అక్కడ వరకూ కొంత డిసప్పాయింట్మెంట్ ఉన్నా ఫస్టాఫ్ డీసెంట్ అని చెప్పుకోవాలి. బట్ సెకండ్ ఆఫ్ ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడి నుంచి సినిమాలో ఉన్న లోపాలు బయటపడటం మొదలవుతుంది. సనాతన ధర్మం కాన్సెప్ట్ గురించి చెప్పాలి...పవన్ కళ్యాణ్ హీరోయిజం ఎలివేట్ చేయాలి..కథను ముందుకు నడిపించాలి ఇది కత్తి మీద సాములా మారిపోయింది డైరెక్టర్ కి. ఫలితంగా ఓ రకమైన ఇరిటేషన్ మొదలువుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కథపరంగా మంచిగానే రాసుకున్నా వాటి ని తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నం సక్రమంగా జరగకపోవటంతో సెకండాఫ్ అయిపోయేప్పటికి అభిమానులే కాదు సగటు ప్రేక్షకుడు కూడా బతుకుజీవుడా అనుకోవాలి.
సినిమాలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో త్రూ అవుట్ పవన్ కళ్యాణ్ తన ఎనర్జీ ని చూపించటానికి వందశాతం ట్రై చేశారు. ఐదేళ్ల కాలం షూటింగ్ జరగకటంతో వేర్వేరు చోట్ల పవన్ కళ్యాణ్ వేర్వేరుగా కనిపిస్తారు. బట్ అది కథను డిస్ట్రబ్ చేయకుండా ఆయన పడిన తాపత్రయం మెప్పిస్తుంది. ఫైట్స్ డిజైనింగ్ విషయంలో, మార్షల్ ఆర్ట్స్ చూపించే విషయంలో పవన్ కళ్యాణ్ తన ఫుల్ ఎఫఱ్ట్స్ పెట్టారు. రెండోది మ్యూజిక్ కీరవాణి తన ఎక్స్ పీరియన్స్ మొత్తాన్ని వాడి సినిమాను ఎలివేట్ చేసే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశారు. పాటలు కూడా పెప్పీగా పవన్ కళ్యాణ్ వేసే స్టెప్పులతో అంతా బాగానే ఉంటుంది. పైగా సనాతన ధర్మాన్ని చూపిస్తూ పవన్ కళ్యాణ్ ప్రమేయంతో సినిమాను ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొన్ని లింక్స్ ఉంటాయి మచిలీపట్నం టూ గోల్కొండ...గోల్కొండ టూ ఎర్రకోట...ఇన్ బెట్వీన్ వచ్చే ఆ సనాతన ధర్మం సీన్స్ పవన్ కళ్యాణ్ పడిన తాపత్రయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.
బట్ నెగటివ్స్ మాట్లాడుకుంటే వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ కథ చెప్పాల్సిన డైరెక్టర్ ఫాల్ట్ క్లియర్ కట్ గా కనిపిస్తుంటుంది. సినిమాలో ఏ సీన్స్ క్రిష్ తీశారు..ఏ సీన్స్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు చాలా ఈజీగా చెప్పేయొచ్చు చూసి. క్రిష్ తీసిన పార్ట్స్ వరకూ ఉన్న గ్రాండియర్ నెస్ అంతా మట్టిలో కలిపేశాలా ఉంటాయి మిగిలిన సీన్స్. ప్రధానంగా VFX అన్ బేరబుల్ అసలు. ఏదో సన్నాఫ్ ఇండియా, కన్నప్పలను ట్రోల్ చేస్తాం కానీ అవి చాలా బెటర్ అనిపిస్తాయి హరి హర వీరమల్లుని చూస్తే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావటం కేటాయించిన టైమ్ లో ఆయన ఆఫీసు పక్కనే ఓ సెట్ వేసి తీసిన పార్ట్స్ వరస్ట్ VFX కళ్ల ముందు క్లోజప్స్ తో తాండవం చేస్తుంటే సగటు పవన్ కళ్యాణ్ అభిమాని పడే బాధ అంతా ఇంతా కాదు. చూపించకపోయినా బాగుండు అనుకుంటే చూపించటానికి వాళ్ల దగ్గర వేరే సీన్స్ లేవు. అక్కడికీ చాలా ల్యాగ్ చేసి చేసి అక్కర్లేని కామెడీ పెట్టి అప్పటికే చేయాల్సిన రచ్చ చేశారు జ్యోతి కృష్ణ. ఔరంగజేబుగా బాబీ డియోల్ మెప్పిస్తారు. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్ వేర్వేరు చోట్ల వేర్వేరుగా కనిపిస్తుంటుంది. ఐదేళ్ల పాటు షూటింగ్ కదా తను మాత్రం ఏం చేస్తుంది.
ఓవరాల్ గా హరిహర వీరమల్లు మంచి కథ. క్రిష్ రాసుకున్న ప్లాట్ లైన్ అయితే అద్భుతంగా ఉందని అర్థం అవుతోంది. బట్ డైల్యూట్ చేసి పారేశారు. దీనికి రెండో పార్ట్ ఉంది కాబట్టి డైరెక్టర్ విషయంలో మరోసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హరిహర వీరమల్లు ఈజ్ డిజాస్టర్ వర్క్ ఆఫ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ. దట్స్ ఇట్.





















