అన్వేషించండి

AP Cabinet: ఏపీలో 50 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం - ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

Andhra: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగపూర్ పర్యటనపై చంద్రబాబు మంత్రులకు వివరించారు.

AP Cabinet decisions:  ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు కొత్త పాలసీకి  ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఉత్పాదనను పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా తీసుకు వచ్చారు.  మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 42 అంశాలపై చర్చ జరిగింది.  దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారధి మీడియాకు వివరించారు. 

స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ద్వారా సుమారు ₹50,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.  ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరియు ఉద్యోగ సృష్టికి దోహదపడతాయని మంత్రి తెలిపారు. అలాగే  క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) సంబంధిత ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  సాగు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు సంబంధించిన నాలా చట్ట సవరణపై చర్చ జరిగింది. ఈ సవరణ భూమి ఉపయోగ నియమాలను సరళీకరించడం ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులను సులభతరం  చేస్తాయి. 

లే ఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి చట్ట సవరణలపై చర్చ జరిగింది.   వీఎంఆర్డీఏ పరిధిలో భూసమీకరణపై, నీటి సరఫరా, సీపేజీ నిర్వహణ ప్యాకేజీలపై,  ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లేఔట్లకు కమిటీ సిఫార్సులపై ,  వార్డు వెల్ఫేర్, డెవలప్ మెంట్ కార్యదర్శి పోస్టుల అప్ గ్రేడ్ పై చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు.  విద్యుత్ జల వనరుల శాఖకు చెందిన పనులపై, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్, తిరుపతిలో తొక్కిసలాటపై ఇచ్చిన నివేదికపై, నూర్ బాషా దూదేకుల అభివృద్ధి కార్పొరేషన్ మార్పుపైనా మంత్రులు చర్చించారు.

సింగపూర్ పర్యటనపైనా చంద్రబాబు స్పందించారు.  గతంలో రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివద్ధి కోసం సింగపూర్ కన్సార్టియం ఏపీకి వచ్చిందన్నారు. ప్రభుత్వం మారిన తరువాత వారిని వెళ్లగొట్టారు.  గత వైసీపీ ప్రభుత్వంలో సింగపూర్ కన్సార్టియం వారిపై అవినీతి ముద్ర వేసి కేసులు పెట్టేందుకు యత్నించారన్నారు. సింగ్ పూర్ వారితో ఉన్న మంచి సంబందాలను చెడగొట్టారని..  మళ్లీ వారితో సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.                             

తిరుపతి తొక్కిసలాటపై నివేదిక మేరకు బాధ్యులపై చర్యలుతతీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. విచారణ కమిటీ అప్పటి గో సంరక్షణ శాల ఉన్నతాధికారిని బాధ్యుడిని చేసింది. ఆ అధికారిపైచర్యలు తీసుకోనున్నారు. తిరుపతి ఘటనపై అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించలేదన్నారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో కలిసి చంద్రబాబు భోజనం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget