అన్వేషించండి
INS Nistar :సైన్యంలో చేరిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్‌ఎస్ నిస్తార్
INS Nistar :విశాఖ నావెల్ డాక్‌యార్ట్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ నిస్తార్ ను జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి నేవీ చీఫ్, హిందుస్థాన్ సీఎండీ పాల్గొన్నారు.
సైన్యంలో చేరిన వార్‌షిప్ నిస్తార్ పొడవు 19.7 మీటర్లు ఉంది. బీమ్ 2.8 మీటర్లు, బరువు 0,587 టన్నులు కలిగి ఉంది. ఇది గంటక 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 12 మంది సిబ్బంది, 113 మంది సెలియలర్స్ ఉంటారు. దీనికి మొదటి కమాండింగ్ ఆఫీసర్‌గా అమిత్ శుభ్రో బెనర్జీ ఉన్నారు.
1/7

INS Nistar :పూర్తి భారతీయ పరిజ్ఞానంతో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్‌ఎస్ నిస్తార్‌ను కేంద్ర రక్షణశాఖసహాయ మంత్రి సంజయ్ సేథ్, ఇండియన్ నేవీ అధిపతి అడ్మిరల్ దినేష్‌కుమార్ త్రిపాఠీ కలిసి జాతికి అంకితం ఇచ్చారు.
2/7

INS Nistar :విశాఖలోని నేవల్ డాక్‌యార్ట్‌లో జరిగిన కార్యక్రమంలో సంజయ్ సేథ్ మాట్లాడుతూ.... భారతీయ ప్రతిష్టకు నిస్తార్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. దేశంలో ఇంకా 57కుపపైగా యుద్ధ నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
3/7

INS Nistar :ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించి ఎగుమతులు పెంచాలని మోదీ ఆలోచనగా చెప్పారు సేథ్. కేవలం రక్షణ రంగ ఎగుమతులే 50 వేల కోట్లకుపైగా చేపట్టాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. క్రమంగా ప్రపంచంలోనే బలమైన దేశంగా భారత్ ఆవిర్భవిస్తోందని అన్నారు.
4/7

INS Nistar :స్వదేశీ పరిజ్ఞానం సత్తా ఏంటో ఈ మధ్య పాకిస్థాన్‌తో జరిగిన ఘర్షణల్లో వెల్లడైందని సేథ్ తెలిపారు. ప్రపంచదేశాలు గుర్తించాయని పేర్కొన్నారు. భారతీయులు సగర్వంగా తలెత్తుకొని నిలబడేలా ప్రధానమంత్రి మోదీ చేశారని అభిప్రాయపడ్డారు.
5/7

INS Nistar స్వదేశీ పరిజ్ఞానంతో వార్‌షిప్‌ల నిర్మాణం ఆనందదాయకమని అన్నారు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠీ. గతంలో రిటైర్ అయిన యుద్ధనౌకల పేరుతో మరిన్ని రాబోతున్నాయని వెల్లడించారు. నిస్తార్ 1971 లో ఘాజీ నాశనమైనట్టు గుర్తించిందని దానికి గుర్తుగానే నిస్తార్ క్లాస్ వార్‌షిప్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు.
6/7

INS Nistar: ఇంకా భారీ సంఖ్యలో వార్‌షిప్‌లు వస్తున్నాయని ఇందులో హిందుస్థాన్ షిప్‌యార్ట్ సేవలు అభినందనీయమని అన్నారు త్రిపాఠీ. నిస్తార్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించామని తెలిపారు హిందుస్థాన్ షిప్‌యార్డ్ సీఎండీ కమొడర్ హేమంత్ ఖత్రీ.
7/7

INS Nistar : సైన్యంలో చేరిన వార్‌షిప్ నిస్తార్ పొడవు 19.7 మీటర్లు ఉంది. బీమ్ 2.8 మీటర్లు, బరువు 0,587 టన్నులు కలిగి ఉంది. ఇది గంటక 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 12 మంది సిబ్బంది, 113 మంది సెలియలర్స్ ఉంటారు. దీనికి మొదటి కమాండింగ్ ఆఫీసర్‌గా అమిత్ శుభ్రో బెనర్జీ ఉన్నారు.
Published at : 19 Jul 2025 11:44 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
ఇండియా
సినిమా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















