Top Headlines: అక్రమాస్తుల కేసులో అధికారిపై ప్రభుత్వం చర్యలు - త్వరలో ప్రజల్లోకి కేసీఆర్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top News In AP And Telangana:
1. అక్రమాస్తుల కేసులో ప్రభుత్వాధికారిపై సర్కారు చర్యలు
చిన్నపాటి అగ్ని ప్రమాదం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా స్పందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కొన్ని నెలల కాలంలో సీఐడీ విచారణ సైతం జరుగుతోంది. పలువురు అధికారులు సైతం సస్పెండ్ అయ్యారు. అందులో సూత్రధారులుగా ఉన్న వారిని అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం లో నూతన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం సర్వసాధారణమని అంతా భావించారు. ఇంకా చదవండి.
2. వైసీపీ కార్యకర్తలకు జగన్ ధైర్యం ఇస్తున్నారా.?
ఏపీలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు తీవ్ ఒత్తిడికి గురవుతున్నాయి.సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టుల్లో మార్ఫింగ్‌లు, బూతులు ఉంటే ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. కుటుంబాలను దూషిస్తూ ఐదేళ్ల పాటు వారు సేఫ్ గా ఉన్నారు.నిజానికి ఇలాంటి వారిలో అత్యధిక మంది ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్ నుంచో.. మరో ప్రభుత్వ వ్యవస్థ నుంచో జీతాలు తీసుకుంటూ వచ్చారు. అలా జీతాలు తీసుకుంటూ అప్పట్లో పెట్టిన పోస్టులే ఇప్పుడు అరెస్టులకు కారణం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వైసీపీ సోషల్ మీడియాను వ్యవస్థీకృత మాఫియాగా చెబుతోంది. దేశ విదేశాల్లో ఉన్న వారికి డబ్బులు ఇచ్చి మరీ పోస్టులు పెట్టిస్తున్నారని అంటున్నారు. ఇంకా చదవండి.
3. త్వరలో ప్రజల్లోకి కేసీఆర్
భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మరోసారి ఫీల్డ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంముగిసిన తర్వాత ఆయన పార్టీ నేతల్ని కలవడం మానేశారు. పూర్తిగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఎవరైనా పుట్టినరోజు సందర్భంగా వస్తే అశీర్వదించడం తప్ప రాజకీయాలు మాట్లాడి చాలా కాలం అయింది. అయితే హఠాత్తుగా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు సమయం ఇచ్చారు. రాజకీయ అంశాలు మాట్లాడారు. దాంతో కేసీఆర్ .. మళ్లీ ట్రాక్‌లోకి వస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇంకా చదవండి.
4. కురుమూర్తి స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని జరుగుతున్న కురుమూర్తి స్వామి జాతరలో పాల్గొనున్నారు. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కురుమూర్తి గుట్టపైకి రూ.110 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఘాట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఇంకా చదవండి.
5. తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల
గ్రూప్-3 పరీక్షల హాల్ టికెట్లు వచ్చేశాయి. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్ టికెట్లను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. నవంబర్ 17, 18 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. నవంబర్ 10 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు TGPSC అవకాశం ఇచ్చింది. ఇంకా చదవండి.