Top Headlines: అమరావతి పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు - సీఎం రేవంత్ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top News In AP And Telangana:
1. అమరావతి పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నాడు పున:ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి పనులు ప్రారంభించారు. ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని అమరావతి పనులను మొదలు కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇంకా చదవండి.
2. ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండుగ మొదలు
తెలుగు ప్రజలకు, సినిమా ప్రేక్షకులకు 'అన్‌స్టాపబుల్' టాక్ షో ద్వారా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)లో ఎవరికీ తెలియని కోణాన్ని పరిచయం చేసింది ఆహా ఓటీటీ (Aha OTT). ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అతి త్వరలో నాలుగో సీజన్ మొదలు పెట్టడానికి రెడీ అవుతోంది. 'అన్‌స్టాపబుల్ 4'లో ఫస్ట్ ఎపిసోడ్ ఎవరిదో తెలుసా?. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎపిసోడ్‌తో 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్ మొదలు కానుంది. ఇంకా చదవండి.
3. సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
గత ఐదారు దశాబ్దాలుగా మురికి నీళ్లు వచ్చేవని, కేసీఆర్ హయాంలో ఎస్టీపీలు కట్టిన తరువాత నీళ్లు శుభ్రంగా వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగోల్ లోని Nagole Sewage Treatment ను శనివారం ఉదయం పరిశీలించారు. నల్లగొండకు సైతం మొన్నటివరకూ మురికి నీళ్లు వెళ్లేవి, కేసీఆర్ చేసిన పనుల వల్ల ఇప్పుడు స్వచ్ఛమైన నీళ్లు వెళ్తాయని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా మూసీ మురికికూపంగా మారడానికి గత పాలకులే కారణమని ఆయన వ్యాఖ్యల్ని కేటీఆర్ సమర్థించారు. ఇంకా చదవండి.
4. గ్రూప్ - 1 వివాదంపై రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్ నిరసన
తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. గ్రూప్ 1 అభ్యర్థుల కష్టాలకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ బాధితులు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులను ఆశ్రయించి తమకు న్యాయం జరిగేలా చేయాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను గ్రూప్ 1 బాధితులు కలిశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన గ్రూప్ 1 అభ్యర్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి, తమకు న్యాయం చేయాలని కోరారు. ఇంకా చదవండి.
5. పీఎస్‌లో ముగ్గురికి శిరోముండనం
పెట్రోల్ బంకులో మొదలైన చిన్న గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ కొత్త మలుపు తిరిగింది. ముగ్గురు యువకులకు ఎస్సై శిరోముండనం చేపించారు. సంచలనం రేపిన ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో గత ఆదివారం జరిగింది. తీవ్ర మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో విషయం వెలుగుచూసింది. యువకుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా చదవండి.