అన్వేషించండి

KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్

Musi Politics in Telangana | బీఆర్ఎస్ హయాంలో మురిగినీటి శుద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నామని, తాము చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

KTR Visits Sewage Treatment Plant at Nagole | హైదరాబాద్: గత ఐదారు దశాబ్దాలుగా మురికి నీళ్లు వచ్చేవని, కేసీఆర్ హయాంలో ఎస్టీపీలు కట్టిన తరువాత నీళ్లు శుభ్రంగా వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగోల్ లోని Nagole Sewage Treatment ను  శనివారం ఉదయం పరిశీలించారు. నల్లగొండకు సైతం మొన్నటివరకూ మురికి నీళ్లు వెళ్లేవి, కేసీఆర్ చేసిన పనుల వల్ల ఇప్పుడు స్వచ్ఛమైన నీళ్లు వెళ్తాయని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా మూసీ మురికికూపంగా మారడానికి గత పాలకులే కారణమని ఆయన వ్యాఖ్యల్ని కేటీఆర్ సమర్థించారు. గత పాలకులు ఎవరో సైతం ప్రజలకు చెబుతూ సెటైర్లు వేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు 4 విషయాలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చా. భారతదేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (Sewage Treatment) నాగోల్ లో ఉంది. 320 ఎంఎన్‌డీ సివరేజ్ ప్లాంట్. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు సహా దేశంలోని ఏ నగరాలలోనూ ఇంత పెద్దది లేదు. పాతదాంట్లో 170 ఎంఎల్‌డీ సామర్థ్యం. రెండూ కలిపితే 500 ఎంఎల్‌డీ సామర్థ్యంతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. 

హైదరాబాద్ కు మూసీ నది ఓ వరం
హైదరాబాద్ లో ఉండే ప్రతి నాలా, పైనుంచి అనంతగిరి నుంచి వచ్చే నీళ్లు అయినా గ్రావిటీ ద్వారా అంతా మూసీలోకి వస్తుంది. గత పాలకుల వల్లే మూసీ మురికికూపంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అది ముమ్మాటికీ నిజం. 2014లో కేసీఆర్ సీఎం అయ్యేదాకా ఎవరు సీఎంగా ఉన్నారో, ఏ పార్టీ అధికారంలో ఉందో ప్రజలకు తెలుసు. ఆ తరువాత ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో మీకు తెలుసు. దేశంలో అత్యంత కాలుష్య కోరల్లో ఉన్నది మూసీ నది అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 2015లో చెప్పింది. అంటే మూసీ నదిని మురికికూపం చేసింది అగ్రభాగం కాంగ్రెస్ పార్టీ, వారి ప్రభుత్వం చేగయా.. మిగతాది 17 వరకు పాలించిన టీడీపీ వాళ్లు కొంత భాగం చేశారు. తిలా పాపం తలా పిడికెడు అంటూ మూసీకి నష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా నీటిని స్వచ్ఛంగా మార్చేందుకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి మేలు చేసిన ఘనత మాదే’ అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పీచ్ వీడియో వీక్షించండి.. 

హైదరాబాద్ లో ప్రతిరోజూ 2 వేల MLD (20 కోట్ల లీటర్లు) లీటర్ల మురికి నీరు తయారవుతోంది. ఒక్క ఎంఎల్‌డీ అంటే ఒక్క మిలియన్ లీటర్ పర్ డే. మిలియన్ అంటే పది లక్షలు. 320 ఎంఎల్‌డీ కెపాసిటీ అంటే 3 కోట్ల 20 లక్షల ఎంఎల్ డీ ఉత్పత్తి అవుతోంది. వంద శాతం సివరేజ్ చేస్తున్న ఏకైక నగరం హైదరాబాద్. మూసీకి పూర్వవైభవం తెస్తామని కేసీఆర్ అన్నారు. మా మేనిఫెస్టోలో కూడా మూసీ విషయం ప్రస్తావించాం. ఇంటిని కట్టాలంటే ఇసుక, రాయి, గుంపు మేస్త్రీ, కరెంట్ అన్ని విషయాలు చూసుకోవాలి. కేసీఆర్ ప్రకారం ముందు మురికి నీళ్లు శుభ్రంగా చేయాలన్నారు. అందుకోసం 3,866 కోట్లతో 1200 పైచిలుకు సామర్థ్యం కలిగిన ప్లాంట్లు కట్టాం. అంబర్ పేటలో 300 ఎంఎల్‌డీ, నాగోలులో 320 ఎంఎల్‌డీ, కూకట్ పల్లిలో 120 ఎంఎల్‌డీ, ఉప్పల్ లో రేవంత్ ప్రారంభించిన చోట, మల్కాజిగిరి, రాజేంద్రనగర్లో ఎస్‌టీపీలు పెట్టాం. కోకాపేటలలో 15 ఎంఎల్‌డీ ల ఎస్టీపీని సబితక్క, నేను ప్రారంభించాం. రేవంత్ కొత్తగా చేసిందేమీ లేదు. 2000 MLD చేసేందుకు ఇదివరకే కేసీఆర్ ఆ ప్రాజెక్టులు పూర్తి చేశారు. బీఆర్ఎస్ చేసిన వాటిని సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తారు. 
బ్రిడ్జిలు కట్టడం..
నీళ్లు శుద్ధి చేయడం తొలి పని. 57.5 కిలోమీటర్లు హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతం ఉంది. ఈ పరిధిలో 84 మీటర్ల జారడుబండలాగ మూసీ ఉంది. మూసీని ఆపాలంటే చెక్ డ్యామ్ కట్టాలి. దాంతోనే బోటింగ్ వస్తుంది. కానీ మూసీకి అడ్డంగా 14 బ్రిడ్జిలు కట్టాలి. మూసారాం బాగ్ బ్రిడ్జిని శంకుస్థాపన చేశాం. అప్పటి నవాబు 1591లో హైదరాబాద్ మూసీకి దక్షిణం వైపు ఉంది. కానీ 1947 వరకు నయాపూల్, పూరానాపూల్ లాంటివి మాత్రమే ఉన్నాయి. హైకోర్టు, సాలార్ జంగ్ మ్యూజియం లాంటివి అదే విధంగా ఉంటూ అంతా నిర్మించుకోవాలి. ఆధునికంగా, అభివృద్ధి చెందినట్లు ఉంటూ ఫ్రాన్స్, గ్రీస్ కు మేం పంపిన ఇంజినీర్లు అంతా పరిశీలించి వచ్చారు. 
 బ్రిడ్జిల కింద చెక్ డ్యాం కట్టాలి..
బ్రిడ్జిల కింద నీళ్లు నిల్వ ఉండేలా చెక్ డ్యాం కట్టాలి. దాంతోనే ఏదైనా ప్రమోజనం ఉంటుంది. నాలుగో విషయం.. పారిశ్రామిక కాలుష్యం అరికట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టుతో గజ్వేల్ కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ మీద కుండలాంటిది. కొండపోచమ్మ నీళ్లను మూసీలో, గండిపేటలో పోస్తే తీసుకొచ్చి పోస్తే నీళ్లు శుద్ధి అవుతాయని’ కేటీఆర్ అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
Musi  Politics : రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుందివీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
KTR News: గత పాలకుల వల్లే మురికికూపంలా మూసీ - సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని సమర్థించిన కేటీఆర్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
సల్మాన్ ఖాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుతోంది - దాని రేటు ఎంత, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
Musi  Politics : రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
రేవంత్‌ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
Game Changer: 'గేమ్ ఛేంజర్‌'లో ఒక్క పాటకు రూ. 20 కోట్లా - శంకర్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!
'గేమ్ ఛేంజర్‌'లో ఒక్క పాటకు రూ. 20 కోట్లా - శంకర్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!
Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Embed widget