Crime News: పీఎస్‌లో ముగ్గురికి శిరోముండనం- అవమానంతో యువకుడి ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం
Head tonsure Case | ఎస్సై తనకు శిరోముండనం చేపించాడని, అవమానం తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Nagarkurnool Siromundanam Case | నాగర్ కర్నూలు: పెట్రోల్ బంకులో మొదలైన చిన్న గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడ కొత్త మలుపు తిరిగింది. ముగ్గురు యువకులకు ఎస్సై శిరోముండనం చేపించారు. సంచలనం రేపిన ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో గత ఆదివారం జరిగింది. తీవ్ర మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో విషయం వెలుగు చూసింది.
యువకుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీనికి కారణమైన లింగాల ఎస్సై జగన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను డిస్మిస్ చేయాలని, తమకు న్యాయం చేయాలని బాధితుడి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే ఇదేనా అని యుకుడి కుటంబం, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది..
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలోని ఓ పెట్రోల్ బంకుకు గత ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు వెళ్లారు. రూ.20కు పెట్రోల్ పోయాలని యువకులు పెట్రోల్ బంకు సిబ్బందిని అడగగా, అందుకు వారు నిరాకరించారు. దాంతో పెట్రోల్ బంకు నిర్వాహకులకు, యువకులకు మధ్య గొడవ జరిగింది. బంక్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని, యువకులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
తల దువ్వడంతో ఎస్సై ఆగ్రహం
పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలో ఒక యువకుడు పోలీసుస్టేషన్‌లో తల దువ్వుకున్నాడు. ఆగ్రహించిన ఎస్సై జగన్ ముగ్గురు యువకులకూ పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేయించినట్లు బాధితుల కుటుంబాలు తెలిపాయి. గుండు కొట్టించాడరని మనస్తాపానికి లోనై ఓ యువకుడు శుక్రవారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తమ వివరాలు వెల్లడించడానికి బాధితుడి కుటుంబసభ్యులు నిరాకరించారు. ‘యువకుల మధ్య గొడవతో మనస్తాపం చెంది తమ బిడ్డ ఆత్మహత్యకు యత్నించాడని’ చెప్పి కుటుంబ సభ్యులు బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించినట్లు వైద్యులు వెల్లడించారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న ఈ ఘటనపై లింగాల పోలీసులు స్పందించాల్సి ఉంది. దాంతో పోలీసులు నిజంగానే యువకులకు శిరోముండనం చేయించారా, లేక ఏదైనా వివాదం కారణంగా వాళ్లే గుండు చేయించుకున్నారా అనే దానిపై స్పష్టత వస్తుంది.
Also Read: Viral News: అర్ధరాత్రి ఎమ్మెల్యేకు మహిళ ప్రైవేట్ వీడియో కాల్, తరువాత ఏం జరిగిందంటే!