Tirumala News: ఏప్రిల్ నెలలో స్వామి దర్శనం చేసుకోవాలనే భక్తులకు టీటీడీ శుభవార్త
Tirumala News: తిరుమల శ్రీవారిని ఏప్రిల్ నెలలో దర్శించుకునే భక్తులకు ఆన్ లైన్ విధానంలో టికెట్లు విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైటు ద్వారా మాత్రమే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరుతుంది

Tirumala news: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి ఏప్రిల్ నెల కోటా టికెట్లను టీటీడీ శనివారం విడుదల చేయనుంది. ఉదయం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేస్తారు.
జనవరి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్ధిత సేవా టికెట్లు జనవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
జనవరి 21న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను జనవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జనవరి 23న అంగప్రదక్షిణం టోకెన్లు….
ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల ఆన్ లైన్ కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జనవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల…
తిరుమల, తిరుపతిలలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
ఈ నెల 27వ తారీఖున శ్రీవారి సేవ సాధారణ, నవనీత, పరాకామణి సేవ కోటాలు ఉదయం 11, మ ధ్యాహ్నం12, మ ధ్యాహ్నం 1గంటకి యథాప్రకారం విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దదర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. దళారులు, ఇతర ప్రైవేటు వెబ్ సైట్‌లను నమ్మి మోసపోకండి అని టీటీడీ సూచిస్తుంది.
Also Read: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్- 20న ఆ దర్శనాలన్నీ రద్దు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

