Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్- 20న ఆ దర్శనాలన్నీ రద్దు
Tirumala News: వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తున్న వేళ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 20న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం మరో రెండు రోజుల్లో ముగియనుంది. 19 వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయి. ఆ తర్వాత రోజు కొన్ని దర్శాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఓ కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిసలాట అనంతర పరిణామాలతో టీటీడీ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా పలు నిర్ణయాలు తీసుకుంది.
ఆదివారంతో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. 20 నుంచి సర్వదర్శనాలు ప్రారంభంకానున్నాయి. అందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. మొన్న జరిగిన లాంటి దుర్ఘటనలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టింది. అందుకే సర్వదర్శనాలపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు గురువారం సమీక్ష నిర్వహించారు.
Also Read: పవన్‌ను మళ్లీ కెలుక్కున్న ప్రకాష్ రాజ్ - నటించండి కానీ జీవించొద్దంటున్న బీజేపీ!
ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టోకెన్ల జారీని నేటితో ముగించేశారు. ఈ నెల 20న సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు సాధారణ ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయడం లేదని పేర్కొన్నారు. సర్వదర్శనం కోసం వచ్చే భక్తులు క్యూలైన్‌లో ఉండి స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
రద్దీని నియంత్రించేందుకు ఆఫ్‌లైన్‌లో ఇచ్చే శ్రీవాణి దర్శన టికెట్లు కూడా 19న ఈసారికి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. టీటీడీ ప్రొటోకాల్ భక్తులకు తప్ప వేరే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. రోజంతా పూర్తిగా సామాన్య భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. అందుకే 19న ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోవద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
పది రోజుల క్రితం వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఆరుగురు మృతి చెందారు. 40 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. వారందిరికీ ప్రభుత్వమే చికిత్సలు చేయిస్తోంది. మృతి చెందిన వారికి ఆర్థిక సాయం కూడా చేసింది. వారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఇవ్వనుంది. గాయపడి కోలుకున్న వారికి స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పించనుంది. దీని కోసం ప్రత్యేక ఏర్పాటు చేయనుంది. ఈ ఘటనతో టీటీడీ మరింత అప్రమత్తమైంది.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్





















