News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TDP Leader Murder Update : జల్లయ్యను హత్య చేసిన వారికి ఉరిశిక్ష వేయాలి - చంద్రబాబు డిమాండ్

జల్లయ్య హ త్యతో పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హత్యలో ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

FOLLOW US: 
Share:

TDP Leader Murder Update :   పల్నాడు జిల్లాలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబీకులకు ఎక్కడకు తీసుకెళ్తున్నామని చెప్పకుండానే మృతదేహాన్ని బొల్లాపల్లి మండలం రావులాపురం తరలించారు. అయితే అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు సహకరించలేదు. జల్లయ్య సహకరిస్తే వైఎస్ఆర్‌సీపీ వర్గీయులు తమపైనా దాడులు చేస్తారేమోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబసభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా రావులాపురం తరలించడంతో  మృతదేహం అప్పగించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా.. తీసుకునేందుకు బంధువులు నిరాకరిస్తున్నారు.  కుటుంబసభ్యులు లేకుండా మృతదేహం ఎలా తీసుకుంటామని బంధువులు చెబుతున్నారు. 

పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.   పల్నాడులో హత్యకు గురైన తెదేపా కార్యకర్త జల్లయ్య మృతదేహాన్ని.. ఆస్పత్రి నుంచి ఎక్కడికి తరలించారో కూడా చెప్పరా? అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిలదీశారు. సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని.. ఈ హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.మరోవైపు జల్లయ్య అంత్యక్రియలకు వెళ్తున్న తెదేపా నేతల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడలేని పోలీసులు.. అంత్యక్రియలకు వెళ్తున్న వారిని అరెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. 

టీడీపీ నేత నారా లోకేష్ కూడా జల్లయ్య కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు. పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు. 

టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతల కారణంగా  పెద్ద ఎత్తున పోలీసుల  బలగాలను మోహరించారు. 

Published at : 04 Jun 2022 03:32 PM (IST) Tags: Chandrababu Lokesh Macharla MLA TDP activist murdered Pinnelli Jallaya murdered

ఇవి కూడా చూడండి

CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్‌గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్

CM Jagan : రూ.3099 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు - వర్చువల్‌గా 12 ప్రారంభం - ప్రజలకు అంకితమిచ్చిన సీఎం జగన్

Chandrababu case : రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ - చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

Chandrababu case :  రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ -  చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

Top Headlines Today: అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కవిత సవాల్

Top Headlines Today: అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కవిత సవాల్

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Koushik Reddy: గెలిస్తే విజయ్ యాత్రతో వస్తా లేకుంటే శవయాత్రకు రండీ- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమోషనల్‌ స్పీచ్‌

Koushik Reddy: గెలిస్తే విజయ్ యాత్రతో వస్తా లేకుంటే శవయాత్రకు రండీ- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమోషనల్‌ స్పీచ్‌

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!

Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!

KCR Election Campaign: హైదరాబాద్‌ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్‌ మీటింగ్

KCR Election Campaign: హైదరాబాద్‌ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్‌ మీటింగ్