News
News
X

CM Jagan Review : ఏపీ నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మారాలి - సీఎం జగన్

నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మాదక ద్రవ్యాల వినియోగం ఉండకూదన్నారు.

FOLLOW US: 
Share:

ఏపీని నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

నార్కొటిక్స్ వినియోగంపై జగన్ సీరియస్ 

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ), ఎక్సైజ్‌ శాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతి కాలేజీ, వర్సిటీలో భారీ హోర్డింగ్స్‌ పెట్టాలని, ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రచారం చేయాలన్నారు. నార్కొటిక్స్‌పై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు. వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలని, మరో రోజు పోలీస్‌ శాఖలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టటంతో పాటుగా, ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. గంజాయి సాగు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాల్సిన బాధ్యత కూడా అధికారులదేనని అన్నారు. సచివాలయాల మహిళా పోలీసులను సమన్వయం చేయటం ద్వారా వారి సేవలను ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. మహిళా పోలీస్‌ల పనితీరు ఇంకా మెరుగుపర్చాలని, దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థంగా అమలు కావాలని ఈ సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు.

ఆ నాలుగు చాలా ముఖ్యం 

నార్కొటిక్స్‌తో పాటు, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం, యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీం జగన్ ఆదేశించారు. రాష్ట్రాన్ని నార్కొటిక్స్‌ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో ఎక్సైజ్, ఎస్‌ఈబీ అధికారులతో పోలీస్‌ శాఖ మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు. అదే విధంగా దిశ యాప్‌ వినియోగం, కాల్స్, వేగంగా స్పందించడం వంటి వాటిపై అన్ని చోట్లా మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని సూచించారు.

ఇవన్నీ రెగ్యులర్‌గా జరగాలి 

ప్రతి మంగళవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని, అక్రమ మద్యం నియంత్రణలో ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ అధికారులు తీసుకున్న చర్యలు, గంజాయి సాగు అరికట్టడంపై సమీక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి గురువారం పోలీస్‌ ఉన్నతాధికారులు సమావేశం కావాలని, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. నార్కొటిక్స్, అక్రమ మద్యాన్ని అరి కట్టడం, సచివాలయాల మహిళా పోలీసులతో సమన్వయం, దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థ వినియోగంపై సమీక్షించాలన్నారు.

కాలేజీలు, వర్సిటీల్లో ప్రచారం...

ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ : 14500 తో పాటు, నార్కొటిక్స్‌ నియంత్రణపై అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద పెద్ద హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని, ఎక్కడా, ఏ ఒక్క విద్యార్థి నార్కొటిక్స్‌ వినియోగించకుండా చూడాలన్నారు. రాష్ట్రాన్ని వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్‌ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దాలని, అదే లక్ష్యంతో పోలీస్, ఎక్సైజ్‌ శాఖ అధికారులు పని చేయాలన్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు.. అన్నీ జీరో నార్కొటిక్స్‌గా ఉండాలని జగన్ ఆకాంక్షించారు. ఆయా శాఖలకు ఇదే లక్ష్యం కావాలని, ఇందు కోసం నెల రోజుల్లో అన్ని కాలేజీలు, వర్సిటీల్లో హోర్డింగ్‌ల ఏర్పాటు పూర్తి కావాలని ఆదేశించారు.

Published at : 19 Dec 2022 04:10 PM (IST) Tags: AP Crime AP CMO AP Drugs CM Jagan narcotics

సంబంధిత కథనాలు

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం

Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

TDP 41 Years : 41 ఏళ్లలో ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు - టీడీపీ పూర్వ వైభవం సాధిస్తుందా ?

TDP 41 Years :   41 ఏళ్లలో ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు - టీడీపీ పూర్వ వైభవం సాధిస్తుందా ?

Weather Latest Update: ఇక తెలుగు రాష్ట్రాల్లో పేట్రేగిపోనున్న ఎండలు! అంతటా పొడిగానే వాతావరణం

Weather Latest Update: ఇక తెలుగు రాష్ట్రాల్లో పేట్రేగిపోనున్న ఎండలు! అంతటా పొడిగానే వాతావరణం

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!